ఆ హీరో నన్ను గుర్తించాలని చాలా చేసేదాన్ని!

jhanvi kapoor about her favourite hero raj kumar rao
Highlights

దివంగత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటించిన 'ధడక్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు 

దివంగత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటించిన 'ధడక్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది జాన్వీ. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. జాన్వీ తను ఇష్టపడే హీరో తనను గుర్తించాలని చాలా ప్రయత్నాలు చేసేదట. ఆ విషయాలను తన మాటల్లో తెలుసుకుందాం. 

''నాకు బాలీవుడ్ లో నవాజుద్ధీన్ సిద్ధిఖీ, రాజ్ కుమార్ రావ్ అంటే చాలా ఇష్టం. ఇక సౌత్ లో ధనుష్ అంటే ఇష్టం. ఈ ముగ్గురూ తమ నటనతో మెప్పిస్తారు. ఇక రాజ్ కుమార్ రావ్ నన్ను గుర్తించాలని తెగ ఆరాటపడేదాన్ని. ఆయన పోస్ట్ చేసే ప్రతి ఫోటోకి లైక్ లు, కామెంట్లు పెట్టేదాన్ని. సెల్ఫీ కావాలని నేను అడిగిన ఒకే ఒక్క హీరో ఆయన'' అంటూ పేర్కొన్నారు. జూలై 20న 'ధడక్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శశాంక్ ఖైతాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా ఇషాన్ ఖత్తర్ హీరోగా నటించారు. 

loader