ఓ ప్రైవేట్ పార్టీలో శ్రీదేవి కూతురు జాహ్నవి హల్ చల్ ప్రియుడు శిఖర్ తో కలిసి మైమరచి నృత్యాలు చేసిన జాహ్నవి జాహ్నవి స్టెప్పుల వీడిను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన మనీష్ మల్హోత్రా

అలనాటి అందాత తార శ్రీదేవి కూతురు జాహ్నవి తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి ఓ పార్టీలో చేసిన డ్యాన్స్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. జాహ్నవి కపూర్ ఇంకా వెండితెరపై ఎంట్రీ ఇవ్వకముందే సంచలనాలు రేపుతోంది. జాహ్నవి, పహారియాలు డాన్స్ చేస్తున్న వీడియోను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. వీడియోకు వైరల్ గా మారుతోంది.

19 ఏండ్ల జాహ్నవి డ్యాన్స్ ఫ్లోర్‌పై రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియుడు శిఖర్ పహారియాతో పార్టీకి హాజరైన జాహ్నవి తుమ్కాలు ఇస్తూ డ్యాన్స్ చేస్తుండగా ప్రియుడు లయబద్ధంగా జోష్ పెంచడం విపరీతంగా ఆకట్టుకొంటోంది. గత కొద్దికాలంగా బహిరంగంగానే వీరద్దరూ కనిపించడం ముంబైకి మీడియాకు పండగగా మారింది. జాహ్నవి, పహారియా ప్రేమకు శ్రీదేవి దంపతుల మద్దతు కూడా ఉందనే వాదన వినిపిస్తున్నది.

మరోవైపు జాహ్నవి కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్‌ రూపొందించే ఓ చిత్రంలో జాహ్నవి నటించనున్నట్టు శ్రీదేవి భర్త బోనీకపూర్ సూచనప్రాయంగా వెల్లడించారు. మరాఠీలో సంచలన విజయం సాధించిన సైరత్ రీమేక్‌లో జాహ్నవి కపూర్, షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్‌ జంటగా నటించనున్నారనే వార్త బాలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే 'జాహ్నవి, ఇషాన్ తెరపైన సరైన జంటగా అనిపించరని, వారిని వేర్వేరు చిత్రాల్లో నటింపజేస్తానని కరణ్ స్పష్టంచేశారు.