Asianet News TeluguAsianet News Telugu

‘పెద్దలకు మాత్రమే’ ప్రోగ్రాం చేస్తున్నా: యాంకర్‌ ఝాన్సీ

నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలో డైలాగ్స్ అద్భుతంగా చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. యాంకరింగ్ వృత్తిని కొనసాగిస్తూనే నటిగా అవకాలు అందుకుని తన ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ ఝాన్సీ ఎక్కువగా ఎంటర్ టైనింగ్ షోలకు యాంకరింగ్ చేయటంవైపు మొగ్గు చూపలేదు. 
 

Jhansi new programme named Peddalaku matrame
Author
Hyderabad, First Published Aug 6, 2020, 12:14 PM IST

ఝాన్సీ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా, నటిగా ఝాన్సీ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలో డైలాగ్స్ అద్భుతంగా చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. యాంకరింగ్ వృత్తిని కొనసాగిస్తూనే నటిగా అవకాలు అందుకుని తన ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ ఝాన్సీ ఎక్కువగా ఎంటర్ టైనింగ్ షోలకు యాంకరింగ్ చేయటంవైపు మొగ్గు చూపలేదు. 

సామజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలకు ఝాన్సీ పనిచేసింది. వరసగా బిజీగా యాంకరింగ్ కెరీర్ కొనసాగుతున్న తన యాంకరింగ్ వృత్తిని ఝాన్సీ ఇటీవల వదలిపెట్టింది.  అయితే ఇప్పుడు ఆమె మరో పోగ్రామ్ కు శ్రీకారం చుడుతోంది.  ఆ ప్రాజెక్టు పేరే అందరికీ ఆసక్తి కలిగిస్తోంది.ఈ విషయాన్ని అలీతో సరదాగా పోగ్రామ్ లో రివీల్ చేసారామె.
  
ఝాన్సీ మాట్లాడుతూ...‘పెద్దలకు మాత్రమే’ అనే ప్రాజెక్టు ఒకటి చేస్తున్నా. ప్రస్తుతం కొవిడ్‌ మనకు ఎన్నో నేర్పించింది. అయితే నేను చేసే ప్రాజెక్టు అందరూ అనుకునేది కాదు. టెలివిజన్‌, వెబ్‌ సిరీస్‌లు వచ్చాక అడల్ట్‌ కంటెంట్‌ అనగానే ‘శరీరం, హింస, క్రైమ్‌, సెక్స్‌’ ఇలాగే ఆలోచిస్తున్నారు. వాటికి మించి మనం పెరిగి పెద్దవుతున్న క్రమంలో కొన్ని నేర్చుకోకుండా పెద్దవాళ్లమైపోయాము. ఆ విషయాలపై చర్చించాలనుకుంటున్నాం అన్నారు.

ఝాన్సీ మాటలు వింటూంటే ఏదో ప్రత్యేకమైన విషయం ఉన్న సబ్జెక్టునే తీసుకుని ముందుకు వస్తోందని అర్దవుతోంది. తాను ఏ కార్యక్రమానికి యాంకర్ గా పనిచేసినా చాలా కమిట్మెంట్ తో చేసానని ఝాన్సీ తెలిపింది. చేతన, నవీన లాంటి కార్యక్రమాలకు దశాబ్దకాలం పనిచేశానని ఝాన్సీ చెప్పుకొచ్చింది. నేను చేసిన కార్యక్రమాలు డబ్బు తీసుకొచ్చే ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలు కాదు. జనాలు ఎగబడి చూసే కార్యక్రమాలు కూడా కాదు. సామాజిక చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు అని ఝాన్సీ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios