జాహ్నవి పుట్టినరోజు ఎలా జరగనుందో తెలుసా..

First Published 5, Mar 2018, 9:07 PM IST
jhahnvi kapoor birthday celebration without sridevi condolences
Highlights
  • అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి పుట్టిన రోజు మార్చి 7న
  • ఫిబ్రవరి 24న హఠాన్మరణం పొంది వెళ్లిపోయిన శ్రీదేవి
  • జాహ్నవి పుట్టినరోజు శ్రీదేవి ప్లాన్ చేసినట్లుగానే జరుగుతుందా..

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి మరో వారం రోజుల్లో తన గారాలపట్టి 'జాహ్నవి' పుట్టిన రోజు ఉందగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మార్చి 7 నాడు జాహ్నవి 21 ఏట అడుగుపెట్టబోతోంది. తల్లిలేకుండా జాహ్నవికి ఇదే మొట్ట మొదటి పుట్టిన రోజు. శ్రీదేవి జీవితంలో జాహ్నవి స్థానం ప్రత్యేకం. జాహ్నవి మొదటి సంతానం కావడం, అందునా ఆడపిల్ల కావడంతో శ్రీదేవికి ముందు నుంచి జాహ్నవిపై అమితమైన ప్రేమ.
 

 

శ్రీదేవి ఎక్కడికెళ్లినా తన కూతురు జాహ్నవిని వెంటబెట్టుకొని వెళ్లేది. తల్లికూతుళ్ల మాదిరిగా కాకుండా మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. ఇంతటి సాన్నిహిత్యం ఉన్న తల్లికూతుళ్లు బాలీవుడ్‌లో కూడా చాలా అరుదు. కూతురితో దిగే ఫొటోలను ఎప్పటికప్పుడు 'ఇన్స్‌టాగ్రాం' ఖాతాలో పోస్టు చేసుకునేది.

 

నిజానికి జాహ్నవి సినిమాల్లోకి రావడం శ్రీదేవికి ఇష్టం లేదు. మరేదైనా కెరీర్ ఎంచుకోవాలని కోరుకునేది. అయితే జాహ్నవికి సినీరంగంపై అమితమైన ఆసక్తి ఉండడంతో కాదనలేకపోయింది. తల్లిగా కూతుర్ని సమర్థించడం తన బాధ్యత అని పలుసార్లు సన్నిహితులతో చెప్పుకునేది. అందుకే జాహ్నవి 'డెబ్యూ' సినిమా 'ధడక్' పనులన్నీ దగ్గరుండి మరీ చూసుకుంది. ఈ సినిమా జులై 20 విడుదల కాబోతోంది. దురదృష్టవశాత్తు తన కూతురు మొట్ట మొదటి సినిమాను కూడా చూడకుండానే శ్రీదేవి తుదిశ్వాస విడిచింది.

 

మరోవైపు కిందటి ఏడు జాహ్నవి పుట్టిన రోజు నాడు జాహ్నవి చిన్ననాటి ఫొటోలను శ్రీదేవి 'ఇన్స్‌టాగ్రాం'లో పోస్టు చేసింది. ఈసారి హిరోయిన్ గా క్రేజ్ సంపాదించింది కాబట్టి జాహ్నవి పుట్టినరోజును గ్రాండ్ గా బాలీవుడ్ సెలెబ్స్ అందరినీ పిలిచి సెలిబ్రేట్ చేయాలని శ్రీదేవి ప్లాన్ చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి కూతురు జాహ్నవి పుట్టినరోజునను సెలిబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. కానీ ఆలోపే అతిలోక సుందరి బాలీవుడ్ చాందినీ తీరని లోకాలకు వెళ్లిపోయింది.

 

అయితే.. ఇప్పుడిప్పుడే తల్లి జ్ఞాపకాలు మరిచి కోలుకుంటున్న జాహ్నవికి ఈసారి పుట్టినరోజున శ్రీదేవి అనుకున్నట్లుగానే గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసి.. జాహ్నవిని సంతోషంగా వుంచాలని కుటుంబసభ్యులు ప్లాన్ చేస్తున్నారట. ఇలాగైనా తల్లిని మరిచి మామూలు రొటీన్ లైఫ్ లోకి వస్తుందేమో చూడాలి.

మరోవైపు బాలీవుడ్ తారలు ఇప్పటికీ బోనీ కపూర్ ఇంటికి వెళ్లి బోనీ, జాహ్నవి, ఖుషీలకు సానుభూతి తెలుపుతున్నారు. అయితే తన పుట్టినరోజున ఎవరూ జాహ్నవికి సానుభూతి తెలపకుండా వుండేలా బోనీతోపాటు కుటుంబ సభ్యులంతా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అర్జున్., అన్షులా కూడా ఈ బర్త్ డే పార్టీకి రానున్నారు.

loader