Asianet News TeluguAsianet News Telugu

తనలోని రొమాంటిక్‌ యాంగిల్‌ని బయటకు తీసిన జెస్సీ.. రవి, ప్రియాలో రియలైజేషన్‌..

ఈ వారం కెప్టెన్‌గా ఉన్న జెస్సీ(jessi) ఇన్నాళ్లు అమాయకుడిగా ఉన్నాడు. ఇదంతా ఓ ఎత్తైతే, జెస్సీలోని రొమాంటిక్‌ బాయ్‌ నిద్ర లేచారు. అమ్మాయిలతో డ్యూయెట్‌ పాడుకోవాలనుందట. మంగళవారం ఎపిసోడ్‌(biggboss5)లో ఆ విషయాన్ని వెల్లడించారు. 

jessi open up in front of swetaa his desire and ravi priya intresting chat
Author
Hyderabad, First Published Sep 28, 2021, 11:37 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌5(biggboss5) మంగళవారం షో మిక్స్ డ్‌ ఫీలింగ్‌తో సాగింది. సోమవారం నామినేషన్స్ లో ఒకరిపై ఒకరు ఆరోపణలతో విరుచుకుపడగా, మంగళవారం ఎపిసోడ్‌లో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ప్రియా(priya), రవి(ravi), అలాగే నటరాజ్‌, రవి,ఇలా అందరు తమ మధ్య నెలకొన్న సమస్యలను చర్చించుకున్నారు. అయితే రవితో మాట్లాడేందుకు కాజల్‌ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఈ విషయంలో మానస్‌ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. 

మరోవైపు ఈ వారం కెప్టెన్‌గా ఉన్న జెస్సీ ఇన్నాళ్లు అమాయకుడిగా ఉన్నాడు. అందరిలో కెళ్ల చిన్నవాడిగా, అమాయకుడిగా వ్యవహరించడంతో మొదట నెగటివ్‌గా ఉన్నా ఇప్పుడు మాత్రం అదే పాజిటివ్‌ అవుతుంది. అయితే కెప్టెన్సీ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అతనికి మైనస్‌గా మారింది. ఇదంతా ఓ ఎత్తైతే, జెస్సీలోని రొమాంటిక్‌ బాయ్‌ నిద్ర లేచారు. అమ్మాయిలతో డ్యూయెట్‌ పాడుకోవాలనుందట. మంగళవారం ఎపిసోడ్‌లో ఆ విషయాన్ని వెల్లడించారు. 

శ్వేతపై తన ఆసక్తిని వెల్లడించాడు. శ్వేతకు తన గర్ల్‌ఫ్రెండ్‌ పాత్ర ఇచ్చి ఓ టాస్క్‌ఇవ్వమని బిగ్‌బాస్‌కే విజ్ఞప్తి చేశాడు. `నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా బిగ్‌బాస్‌.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్‌ పెట్టండి. `మనోహర.. మనోహర`అనే రొమాంటిక్‌  సాంగ్‌ ప్లే చేయండి` అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది. దీంతో జెస్సీలోని ఈ మార్పుకి అంతా షాక్‌ అవుతున్నారు. టాస్క్ లో భాగంగా జుట్టు కత్తిరించుకున్నాడు జెస్సీ. 

బిగ్‌బాస్‌5 హౌజ్‌లో విచిత్రమైన ప్రవర్తనతో వ్యవహరిస్తున్నారు నటరాజ్‌ మాస్టర్‌. నిన్నటి నామినేషన్స్‌లో కూడా గుంటనక్క ఇష్యూ తెరపైకి వచ్చింది. గుంటనక్క అని నన్నే అన్నావ్‌ కదా అని యాంకర్‌ రవి అడగ్గా.. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్‌ అని నటరాజ్‌ మాస్టర్‌ కౌంటర్‌ ఇచ్చాడు.  ఈ రోజు కూడా గుంటనక్క ఇష్యూపై రవి ప్రశ్నించారు. దానికి పికాక్‌ ఎగిరిపోయిందని లహరిని ఉద్దేశించి రవి దగ్గర జోక్‌ చేశాడు నటరాజ్‌ మాస్టర్‌. సర్లే మాస్టర్ గుంటనక్క నేనే కదా.. నిజం చెప్పండి మాస్టర్.. ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అని అంటే.. అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.. నాకు ఎట్లా ఉంటుంది అన్నా.. అని రవి అడగ్గా .

 దీంతో నటరాజ్‌ మాస్టర్‌ రవి దగ్గర గుంటనక్క మ్యాటర్‌ ఓపెన్‌ అయ్యాడు. ఓ ఊసరవెళ్లి నా దగ్గరకు వచ్చి రవికి గుంటనక్క అని కరెక్ట్‌గా పేరు పెట్టారని అన్నాడు అంటూ విశ్వని ఇరికించాడు మాస్టర్‌. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా విశ్వ దగ్గర ప్రస్తావించాడు రవి. `నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా` అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని నిలదీశాడు రవి. దీంతో విశ్వ షాకయ్యాడు. 

మరోవైపు నామినేషన్‌ ప్రక్రియ  రవి, కాజల్‌ మధ్య దూరం పెంచినట్లు తెలుస్తోంది. నన్ను చెంపపై కొట్టావని చెబుతూ రవి నామినేట్‌ చేయడాన్ని అస్సల్‌ రిసీవ్‌ చేసుకోలేకపోయింది కాజల్‌. నీతో మాట్లాడలని లేదు అని రవి ముఖం మీదే చెప్పింది. మరోవైపు లహరి విషయంలో, గతంలో జరిగిన విషయాల్లో రవి, ప్రియా రియలైజ్‌ అయ్యారు. ఇకపై ఎలా ఉండాలో మాట్లాడుకున్నారు. మరోవైపు వెయిట్‌ లాస్‌ గేమ్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఫుడ్‌ అంతా తీసుకెళ్లిపోయేలా ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత జరిగిన గేమ్‌లో నటరాజ్‌ మాస్టర్, లోబో, అలాగే శ్రీరామ్‌, హమీద కలిసి గేమ్‌ ఆడగా, ఇందులో శ్రీరామ్‌, హమీద గెలిచారు. అనంతరం నటరాజ్‌మాస్టర్‌ గట్టిగా అరవడం,లోబోతో ఏదేదో మాట్లాడటం చిరాకు పుట్టించింది.

Follow Us:
Download App:
  • android
  • ios