Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: సిరి, ప్రియాంకలను కిస్‌ అడిగిన జెస్సీ.. సుఖ పురుషుడంటూ పింకీ హాట్‌ కామెంట్..

 59వ రోజు ప్రారంభం ప్రధానంగా గత నామినేషన్ల ప్రక్రియ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం విమర్శలు చేసుకోవడంతో స్టార్ట్ అయ్యింది. ఇందులో  సన్నీ- మానస్‌, అనీ మాస్టర్- శ్రీరామ్‌, షణ్ముఖ్‌ సిరి ఇలా ఒక్కొక్కరు మరొకరి గురించి మాట్లాడుకుంటున్నారు. 

jessi asked kiss to siri and priyanka manas hot commetns on priyanka
Author
Hyderabad, First Published Nov 3, 2021, 11:37 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5 (Bigg Boss Telugu 5).. 59వ రోజు(60వ ఎపిసోడ్)లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి జెస్సీ, సిరి, ప్రియాంకల మధ్య చోటు చేసుకుంది. ఇప్పుడిది బిగ్‌బాస్‌ ఐదవ సీజన్‌లోనే హైలైట్‌గా, హాట్‌ టాపిక్‌గా మారిందని చెప్పొచ్చు. 59వ రోజు ప్రారంభం ప్రధానంగా గత నామినేషన్ల ప్రక్రియ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం విమర్శలు చేసుకోవడంతో స్టార్ట్ అయ్యింది. ఇందులో  సన్నీ- మానస్‌, అనీ మాస్టర్- శ్రీరామ్‌, షణ్ముఖ్‌ సిరి ఇలా ఒక్కొక్కరు మరొకరి గురించి మాట్లాడుకుంటున్నారు. 

Bigg Boss Telugu 5, 59th dayలో పింకీపై హాట్‌ కామెంట్‌ చేశాడు మానస్‌. ఊహించిన విధంగా ఆమెని ఉద్దేశించి మాట్లాడారు. పింకీ తన గేమ్‌ తాను ఆడుతుందని, ఎవరు చెప్పినా వినదని తెలిపాడు. ఎవరు ఏం చెప్పినా సరే అన్నయ్యా అంటుంది. ఆ తర్వాత పోరా బచ్చా అనుకుంటుందని వ్యాఖ్యానిచ్చారు. పింకీపై మానస్‌ ఇలాంటి బోల్డ్ కామెంట్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది. మరో సందర్భంగా తన వద్దకు వచ్చిన పింకీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిన్ను ఎవరైనా నామినేట్‌ చేస్తే వాళ్లు ఇక అయిపోవాలి అనేట్టుగా ప్రవర్తిస్తుంటావని అంటాడు. 

ఇదిలా ఉంటే ఇందులో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జెస్సీ బెడ్‌పై పడుకోగా, ఆయన పక్కన సిరి కూర్చొని ఉంది. వీరిద్దరు డిస్కషన్‌ చేసుకుంటున్నారు. అంతలో పింకి వచ్చింది. నువ్వు సుఖ పురుషుడివిరా అంటూ హాట్‌ కామెంట్‌ చేసింది. అంతేకాదు ఆయన పక్కన పడుకుని జుట్టు, నుదురు నిమిలింది. రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. సెటైర్లు వేసింది. అయతే దీనికి జెస్సీ స్పందించాడు. తన కోరికని బయటపెట్టాడు. ఇద్దరు కలిసి తనకు ముద్దు పెట్టాలని కోరాడు. ఇద్దరు కలిసి ముద్దు పెట్టండి అంటూ అనగా, పింకీ, సిరి చాలా నార్మల్‌ గానే రియాక్ట్‌ అవడం షాకిచ్చింది. మరోసారి ఆ విషయాన్నిజెస్సీ రిపీట్‌ చేశాడు. 

అయితే దూరంగా ఉన్న శ్రీరామ్‌.. వీరి మధ్య జరుగుతున్న విషయాన్ని గమనించాడు. దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశాడు. అది చూసి ప్రియాంక మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. అందరిని షాక్‌కి గురిచేసింది. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా `సూపర్‌ హీరో వర్సెస్‌ సూపర్‌ విలన్స్` టాస్క్ ఇచ్చాడు. ఇందులో రెండు గ్రూపులుగా ఇంటి సభ్యులను విడగొట్టారు. విలన్స్ టీమ్‌లో రవి, అనీ, సన్నీ, విశ్వ, సిరి ఉన్నారు. మరోవైపు హీరోస్‌ టీమ్‌లో షణ్ముఖ్‌, శ్రీరామ్‌, ప్రియాంక, జెస్సీ, కాజల్ ఉన్నారు. 

also read: బెడ్‌పై థైస్‌ అందాలు ఆరబోసిన అమలాపాల్‌.. దీపావళి ఫెస్టివల్ అంటే ఇది కదా..చూసినోళ్లకి చూసుకున్నంత

ఇందులో గెలుపొందేందుకు ముందుగా ఇరు టీమ్‌లు ప్రాణాళికలు రాసుకున్నారు. రవి తన టీమ్‌ని గౌడ్‌ చేశాడు. షణ్ముఖ్‌ తన హీరోస్‌ టీమ్‌ని గైడ్‌ చేశాడు. రవి లీడ్‌ చేస్తున్నాడని, అతన్ని పడగొడితే టీమ్‌ మొత్తం సెట్‌ అయిపోతుందంటాడు. మరోవైపు రవి సైతం హీరోస్‌ టీమ్‌లో శ్రీరామ్‌, కాజల్‌లను చూసుకోవాలని తెలిపారు. మనం మాత్రం విలన్స్ అని, విలన్ల లాగే ప్రవర్తించాలని తెలిపారు. మొదట హీరోస్‌ టీమ్‌ని ఇబ్బంది పెట్టే సన్నివేశం చోటు చేసుకుంది. ఇందులో హీరోస్‌ టీమ్‌ నుంచి శ్రీరామ్‌ వచ్చాడు. అతనికి జ్యూస్‌ తాగించి, డిప్స్ కొట్టించి, కుప్పిగంతులేయించారు. తలపై రంగు పోశారు. ఫైనల్‌గా జుట్టు కట్‌ చేయాలని ప్రయత్నించారు. దీంతో టాస్క్ కంప్లీట్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ ఆదేశాల వరకు ఉండటంతో హీరోస్‌ టీమ్‌కి ఓ పాయింట్‌ వచ్చింది. 

ఆ తర్వాత గార్డెన్‌లో ఉన్న ఓ బాక్స్ తాళం తీయాల్సి ఉంటుంది. ఇందులో మొదట విశ్వ దాన్ని చేసి చూపించారు. రెండో సారి కూడా తనేవిన్నర్‌ అయ్యారు. దీంతో విలన్స్ టీమ్‌ ఆ టాస్క్ లో విన్నర్ అని చెప్పొచ్చు. మరోవైపు విలన్స్ టీమ్‌ని ఇబ్బంది పెట్టే గేమ్‌ స్టార్ట్ అయ్యింది. ఇందులో రవిని ఎంచుకున్నారు హీరోస్‌ టీమ్‌. ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. తన దుస్తులకు పేడ పూయించారు. తన బట్టలకు కూడా పూయాలన్నారు. కానీ వెనక్కి తగ్గారు. మరోవైపు డంబెల్స్ తో జిమ్‌ చేయించడం, డిప్స్ కొట్టించడం, ఐదు రకాల జ్యూసులు తాగించారు. ఎంతో కష్టపడ్డ రవి కూడా బిగ్‌బాస్‌ బజర్‌ మోగేంత వరకు ఉండి తన టీమ్కి పాయింట్‌ తీసుకొచ్చాడు. ఆ తర్వాత రేపటి గేమ్‌లో మానస్పై ప్రియాంక, షణ్ముఖ్‌పై సిరి అలగడం విశేషంగా చెప్పొచ్చు. 

ప్రస్తుతం బిగ్‌బాస్‌ గేమ్‌ తొమ్మిదో వారానికి చేరుకుంది. గత వారం లోబో ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది ఉన్నారు. ఇందులో కెప్టెన్ షణ్ముఖ్‌ సేవ్‌కాగా, మంగళవారం జరిగిన టాస్క్ లో భాగంగా అనీ మాస్టర్, మానస్‌ సేవ్ అయ్యారు. సన్నీ, శ్రీరామ్‌, సిరి, కాజల్‌, ప్రియాంక, జెస్సీ, విశ్వ, రవి ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios