నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘జెర్సీ’. నాగ వంశీ నిర్మాణంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ సినిమా రీసెంట్ గా  షూటింగ్ పూర్తిచేసుకొంది. దాంతో  ప్రమోషన్ కార్యక్రమాల స్పీడు పెంచేసారు. ఇందులో భాగంగా నిన్న (ఏప్రిల్ 12న) చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ప్రేమ, ఎమోషన్ సీన్స్ తో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్    తెచ్చుకుంటోంది.

సోషల్ మీడియాలో వేగంగా దూసుకుపోతూ ఇప్పటివరకు ఈ ట్రైలర్ 4 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. 

ఈ నేపధ్యంలో  చిత్రం రిలీజ్ కోసం తెలుగు రాష్ట్రాలతో స‌హా ఓవ‌ర్సీస్ లోనే జెర్సీ రిలీజ్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మరో ప్రక్క సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ గా జ‌రిగింది.  ఓవ‌ర్సీస్ లో అయితే  తెలుగువాళ్లు ఈ ట్రైలర్ గురించే మాట్లాడుతున్నారంటున్నారు.   ఒక్క ఓవ‌ర్సీస్ నుంచే కలెక్షన్స్ కుంభవృష్ణి కురుస్తుందని అంచనా వేస్తున్నారు.  దాంతో ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ డిస్ర్టిబ్యూట‌ర్స్, ఎగ్జిబిట‌ర్స్ ఫ్యాన్సీ ఆఫ‌ర్ల‌తో ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది.  

పదేళ్ల తర్వాత అర్జున్‌ (నాని) క్రికెట్‌కు దూరమై అటు ఉద్యోగం లేక ఇటు కుటుంబాన్ని నెట్టుకురాలేక సతమతమవడాన్ని చూపించారు. ‘పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..’ అంటూ నాని ఉద్వేగంతో చెబుతున్న డైలాగ్‌ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది.