Asianet News TeluguAsianet News Telugu

Jersey: ఓటీటీలోకి హిందీ “జెర్సీ” మూవీ.. స్ట్రీమింగ్ డేట్

.  ‘జెర్సీ’ చూసిన జనం అంత ఇంట్రస్టింగ్ గా మూవీ లేదని తేల్చేసారు. ఇందులో షాహిద్, మృణాల్ నటనకి, కథ, ఇతర నటీనటుల పర్ఫామెన్స్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. 

Jersey Seals Its OTT Release Date
Author
Mumbai, First Published May 18, 2022, 4:45 PM IST

రీసెంట్ గా బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన  “జెర్సీ” రిలీజైన సంగతి తెలసిందే. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రానికి ఇది రీమేక్.  దిల్ రాజు, నాగ‌వంశీ, అమ‌న్ గిల్ కలిసి ఈ చిత్రాన్ని అదే పేరుతో దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో హిందీలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు కేవలం 20 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది.   

‘కబీర్ సింగ్’ తర్వాత ఈ యంగ్ హీరో  చేసిన సినిమా కావడంతో బాలీవుడ్ జనాలు ఎంతో ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురు చూశారు.  ‘జెర్సీ’ చూసిన జనం అంత ఇంట్రస్టింగ్ గా మూవీ లేదని తేల్చేసారు. ఇందులో షాహిద్, మృణాల్ నటనకి, కథ, ఇతర నటీనటుల పర్ఫామెన్స్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ఈ నేపధ్యంలో  ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్‌లో ఈనెల 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతుంది. 

 ఈ చిత్రంలో నటించిన మృణాల్ మాట్లాడుతూ.. ‘జెర్సీ ఫలితం నన్ను ఎంతో నిరుత్సాహపరిచింది. ఇందులో ఫర్ఫామెన్స్‌ బాగానే ఉన్నప్పటికీ విడుదలైన సమయం, మార్కెటింగ్ వంటి కారణాలు కలెక్షన్లని ప్రభావితం చేసి ఉండొచ్చు. వీటికి సంబంధించి మేం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. బహుశా ఇది ఒక దశ కావొచ్చు. అలాగే ఇంకా వేరే కారణాలు చాలా ఉండొచ్చు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అయితే మంచి సినిమాకి ఇలాంటి ఫలితం రావడం కొంచెం బాధగానే ఉంది. నిజాయితీగా చెప్పాలంటే నేను కొంచెం నిరాశలో ఉన్నాను. ఇవన్నీ పక్కన పెడితే తదుపరి చిత్రం కోసం మరింత కష్టపడి పని చేయాలని నిర్ణయించుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే ‘సినిమా విడుదలై మూడు వారాలు అవుతోంది. అయినప్పటికీ సినిమాని చూసేందుకు ఆడియన్స్ ఇంకా థియేటర్స్‌కి వస్తున్నారు. మూవీ క్రేజ్ మెల్లిగా పుంజుకుంటోంది. అయితే ఇప్పటికే నాని చిత్రం ‘జెర్సీ’ హిందీ డబ్బింగ్ వెర్షన్ టీవీలో ప్రసారం కావడం, అలాగే యూట్యూబ్‌లో అందుబాటులో ఉండడం వల్ల మేం ఆశించిన స్థాయి ఫలితం దక్కలేదు. ఇదే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి’ అని తెలిపింది.  

Follow Us:
Download App:
  • android
  • ios