నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా శుక్రవారం నాడు విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

తొలివారం పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.15.85 కోట్ల షేర్ ని వసూలు చేసింది. అమెరికాలో ఈ సినిమా 915డాలర్ల గ్రాస్ ని రాబట్టింది. అక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే మిలియన్ మార్క్ ని క్రాస్ చేయాలి. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే అది పెద్ద విషయంగా  అనిపించడం లేదు. 

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 

నైజాం.................................. రూ4.92 కోట్లు 
సీడెడ్...................................రూ.1.01 కోట్లు
ఉత్తరాంధ్ర............................రూ.1.31 కోట్లు 
తూర్పుగోదావరి.................... రూ.0.86 కోట్లు 
పశ్చిమ గోదావరి.....................రూ.0.63 కోట్లు 
కృష్ణా.....................................రూ.0.77 కోట్లు 
గుంటూరు..............................రూ.0.82 కోట్లు 
నెల్లూరు................................రూ.0.36 కోట్లు 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రాబట్టిన షేర్ రూ.10.68 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా............... రూ.1.35 కోట్లు 
ఓవర్సీస్......................................రూ.3.80 కోట్లు 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన షేర్ రూ.15.83 కోట్లు