జెన్నీ.. జీన్స్ జారిపోయినట్లున్నాయే..!

Jennifer Lopez's Denim Boots Have Twitter Freaking Out
Highlights

తెల్లని షర్ట్, కూలింగ్ గ్లాసెస్ తో అదిరిపోయే లుక్ లో కనిపించిన జెన్నీ తన జీన్స్ జారిపోతున్న.. చూసుకోవడం లేదేంటని కొందరు నోరెళ్లబెట్టారు. జీన్స్ జారిపోతున్న.. దాన్ని ఆమె గమనించకపోవడం అర్ధంకాక ఆమె ఫోటోలను తీసుకుంటూ చోద్యం చూశారు

తన పాటలు, నటనతో అభిమానులను ఆకర్షించే జెన్నిఫర్ లోపెజ్.. లేటెస్ట్ గా ఫాలో అవుతున్న ట్రెండ్ అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె వేసుకున్న బూట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో లో హాట్ టాపిక్ గా మారాయి. వైవిధ్యమైన ఒక డ్రెస్ వేసుకొని జెన్నిఫర్ రోడ్ల మీద దర్శనమిచ్చింది. తెల్లని షర్ట్, కూలింగ్ గ్లాసెస్ తో అదిరిపోయే లుక్ లో కనిపించిన జెన్నీ తన జీన్స్ జారిపోతున్న.. చూసుకోవడం లేదేంటని కొందరు నోరెళ్లబెట్టారు.

జీన్స్ జారిపోతున్న.. దాన్ని ఆమె గమనించకపోవడం అర్ధంకాక ఆమె ఫోటోలను తీసుకుంటూ చోద్యం చూశారు. కానీ అసలు నిజం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. జెన్నీ ధరించింది జీన్స్ కాదు.. డెనిమ్ కంపెనీకు చెందిన కొత్తరకం బూట్లు. జీన్స్ పాంట్ ను పోలి ఉండే ఆ బూట్లు జెన్నిఫర్ మోకాళ్ల వరకు రాగా, వాటికి ఉన్న బెల్టు, పాకెట్టు జీన్స్ మాదిరి డిజైన్ చేశారు. దీంతో అందరూ జెన్నిఫర్ జీన్స్ జారిపోతున్నాయనుకొని పొరపాటు పడ్డాడు. ఇప్పుడు ఈ బూట్లు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.  

loader