హీరోయిన్ గా ఎదగాలంటే నటీమణులు ఎన్నో అండ్డంకులు దాటుకుని రావలసి ఉంటుంది. కానీ లైంగిక వేధింపుల నేపథ్యంలో కొంతమంది విధిలేని పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని చంపుకుని అవకాశాలకోసం చెప్పింది చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 48 ఏళ్ల వయసులో కూడా చెదరని అందం జెన్నిఫర్ లోఫెజ్ సొంతం. అంతటి అపురూప సౌందర్య వతి ఆమె. జెన్నిఫర్ పాట అన్నా, డాన్స్ అన్నా నటన అయినా వెర్రెత్తిపోయే అభిమానులు ఉన్నారు. యువకుల హృదయాలలో కొలువై ఉన్న అందాల దేవత జెన్నిఫర్ లోఫెజ్. కాస్టింగ్ కౌచ్ గురించి తను మాట్లాడుతు తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని వివరించింది.

కెరీర్ ఆరంభంలో తాను ఆడిషన్స్ కు వెళ్ళినపుడు సినీ దర్శకుడు తనతో నిసిగ్గుగా ప్రరవర్తించాడని జెన్నిఫర్ తెలిపింది. బట్టలు విప్పి బ్రెస్ట్ చూపించాలని అడిగాడు. నా గుండెలో వేంటనే గుబులు మొదలైందని జెన్నిఫర్ తెలిపింది.

అతడు చెప్పింది చేయకుంటే అవకాశం రాదు. దీనితో కొంత సమయం మనసులో మదన పడ్డా. ఒక వేళ అతడు చెప్పింది చేస్తే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. దైర్యంగా చేయనని అతడితో చెప్పి వచ్చేశానని జెన్నిఫర్ లోఫెజ్ వివరించింది.