మూడు రోజుల క్రితం హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ ఫ్యామిలీ కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందంటూ ఉదయం వార్తలు వినిపించాయి. రాజశేఖర్‌ తనయ శివాత్మిక ట్విట్టర్‌ ద్వారా స్పందించి `డాడీ ఆరోగ్యం డిఫికల్ట్ గా ఉందంటూ ఓ పోస్ట్ పెట్టింది. అభిమానుల ప్రేమ, ప్రార్థనలు చేయాలని తెలిపింది. దీంతో రాజశేఖర్‌ ఆరోగ్యం మరీ క్రిటికల్‌గానే ఉందని ఆ తర్వాత చెప్పారు. దీంతో ఇది ఓ సందిగ్ధం నెలకొంది. 

తాజాగా దీనిపై నటి, రాజశేఖర్‌ భార్య జీవితా రాజశేఖర్‌ స్పందించారు. రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని పేర్కొంది. తప్పుడు వార్తాలను, పుకార్లని నమ్మవద్దని పేర్కొంది. మా విషయంలో పాజిటివ్‌గా ఉండాలని, త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేయాలని అభిమానులను ఈ సందర్భంగా జీవిత కోరింది. రాజశేఖర్‌ సిటీ న్యూరో సెంటర్‌లో కరోనా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.