ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్  గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే నరేష్ ప్యానెల్ గా నాగబాబు మద్దతుగా ఉండడం వలనే వారు గెలిచారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఈ వార్తలను నటి జీవిత ఖండించారు.

'మా'లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జీవిత తాజాగా తన ఇంటి వద్ద ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జగన్ కి తన శుభాకాంక్షలు చెప్పారు. అలానే 'మా' ఎన్నికల్లో తమ ప్యానెల్ గెలుపుకి నాగబాబు కారణంకాదని ఆమె అన్నారు. 'మా' ఫ్యామిలీ అందరం ఒకటేనని, నాగబాబు ఇంటింటికీ వెళ్లి ఓట్లేయమని చెప్పలేదని అన్నారు.    

మేం కష్టపడి ప్రచారం చేసుకున్నామని అన్నారు. తను, తన భర్త రాజశేఖర్, ఇద్దరూ కూతుర్లు ప్రతి మెంబర్ కి ఫోన్ చేసి ఓట్లు వేయమని అడిగామని, మేం మంచి చేస్తామని నమ్మి వారు ఓట్లు వేసినట్లు తెలిపారు.

దానికి నాగబాబు లాంటి వాళ్లు సపోర్ట్ చేశారే తప్ప, దాని వల్లే తాము గెలిచామని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. సోషల్ మీడియాలో ఈ తరహా విమర్శలు రావడంతో ఆమె  మండిపడ్డారు. మా మీద కామెంట్స్ చేయడానికి, మేం ఏం చేయాలో చెప్పడానికి మీరు ఎవరంటూ నెటిజన్లపై ఫైర్ అయింది.