యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మంగళవారం రోజు రాజశేఖర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖర్ దంపతులు పాల్గొన్నారు. అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమధానం ఇచ్చిన జీవిత.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కల్కి సినిమా దర్శత్వంలో మీరు జోక్యం చేసుకున్నారటగా అని ప్రశ్నించగా జీవిత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి మీడియాకు కొన్ని అంశాలు తెలియజేయాలనుకుంటున్నా. దాదాపు 20 కోట్ల పైగా బడ్జెట్ తో తాము ఈ చిత్రాన్ని నిర్మించామని జీవిత తెలిపింది. సినిమా నిర్మాతలమైన మాకు తెరకెక్కించే విధానం నచ్చాలి కదా.. ముందుగా కల్కి మూవీ చిత్ర యూనిట్ మొత్తానికి నచ్చితేనే 10 కోట్ల మంది ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. 

సినిమా గురించి తెలియని దాన్ని కాదు.. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాం. మేమెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను రూపొందించిన చిత్రాలు బాగా ఆడినా ఆడకపోయినా.. దర్శకత్వంలో నాకు పట్టు ఉన్న మాట వాస్తవం. నా అనుభవాన్ని ఎవ్వరూ కాదనలేరు.

సినిమా మాది కాబట్టి అందులో మా జోక్యం తప్పనిసరిగా ఉంటుంది. మీరెందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు.. దర్శకుడికి మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చారా ఈ విధంగా ప్రశ్నలు అడగాలి అంటూ మీడియాపై జీవిత జాగ్రత్త వ్యక్తం చేశారు.