వచ్చేనెల 1న తమ కూతురు, సినీనటి శివాని జన్మదినం సందర్భంగా హరితహారంలో పాల్గొంటామని సినీ నిర్మాత, నటి జీవిత రాజశేఖర్‌ తెలిపారు. ఈరోజు ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. త్వరలోనే తెలంగాణలో మరో విడత హరిత హారం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరితహారంలో తమ భాగస్వామ్యం విషయమై జీవిత చర్చించారు. ఈ సందర్భంగా జీవిత మీడియాతో మాట్లాడుతూ... తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై చర్చించామని అన్నారు. తమ కుటుంబ సభ్యులమంతా వచ్చేనెల 1న మొక్కలు నాటుతారని చెప్పారు.