అనుమతి లేకుండా కారును దుకాణం ముందు పార్కింగ్ చేయ‌డ‌మే కాకుండా ఎందుకు పార్క్ చేశారని అడిగినందుకు కాంగ్రెస్ నేత కౌశిక్  తమ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచినట్లు  సినీ నటుడు రాజశేఖర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ సోదరుడైన గుణశేఖర్ అలాగే జీవిత దాడి జరిగినందుకు పోలీసులను ఆశ్రయించారు. 

దాడిపై మరోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన జీవిత కౌశిక్ ఫోటో చూపించి ఘటనపై స్పందించారు.  గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌రుపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ ఆమె రాహుల్ గాంధీతో ఉన్న ఫోటో చూపించారు. ఇలాంటి రౌడీలకు పార్టీలలో టికెట్లు ఎలా ఇస్తారని కాంగ్రెస్ హై కమాండ్ ను జీవిత ప్రశ్నించారు. 

మేము తెలంగాణ వాళ్ళం అంటూ ఇష్టం వచ్చినట్లు తన మరిదిపై దాడి చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నట్లు జీవిత మీడియాతో మాట్లాడారు.  

"

దాడి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడిపై జీవిత రాజశేఖర్ ఫిర్యాదు!