Asianet News TeluguAsianet News Telugu

దాడి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడిపై జీవిత రాజశేఖర్ ఫిర్యాదు!

 జీవిత రాజశేఖర్,  కౌశిక్ అనే కాంగ్రెస్ నేతపై బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పిర్యాదు చేయడం సంచలనం సృష్టించి. కౌశిక్ అనే వ్యక్తి కావాలని తన మరిదిపై దాడి చేశారని జీవితా రాజశేఖర్ దంపతులు ఆరోపణలు చేస్తున్నారు. జీవిత ఏసీపీ ఆఫీస్ లో పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో వైరల్ గా మారింది. 

jeevitha rajashekar latest news
Author
Hyderabad, First Published Feb 4, 2019, 6:34 PM IST

 కౌశిక్ రెడ్డి అనే కాంగ్రెస్ నేతపై జీవిత రాజశేఖర్ హైదరాబాదులోని బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. కౌశిక్ అనే వ్యక్తి కావాలని తన మరిదిపై దాడి చేశారని జీవితా రాజశేఖర్ దంపతులు ఆరోపణలు చేస్తున్నారు. జీవిత ఏసీపీ ఆఫీస్ లో పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో వైరల్ గా మారింది. 

అక్ర‌మంగా కారును దుకాణం ముందు పార్కింగ్ చేయ‌డ‌మే కాకుండా ఇదేమ‌ని ప్ర‌శ్నించినందుకు సినీన‌టుడు రాజ‌శేఖ‌ర్ సోద‌రుడు గుణ‌శేఖ‌ర్ వ‌ర‌ద‌రాజ‌న్‌ను గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌రుపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ జీవితారాజ‌శేఖ‌ర్‌లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావుకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 45లో ఉన్న గుణ డైమండ్స్ ముందు కౌశిక్‌రెడ్డి త‌న కారును నిలిపి వేరే చోటికి వెళ్లాడ‌ని, ఇదేమ‌ని గుణ‌శేఖ‌ర్ ప్ర‌శ్నించినందుకు ప్రాంతం పేరుతో దూషిస్తూ ఆయ‌న‌ను తీవ్రంగా కొట్టాడని జీవిత రాజశేఖర్ ఆరోపించారు.

ఆ ఘటనలో గుణ‌శేఖ‌ర్‌కు తీవ్ర‌గాయ‌ల‌య్యాయి. నాటి నుంచి ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే డిశ్చార్జి అయిన గుణ‌శేఖ‌ర్‌తో క‌లిసి వ‌చ్చిన జీవితారాజ‌శేఖ‌ర్‌లు ఈ మేర‌కు ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజీల‌ను ప‌రిశీలించాల‌ని ఆయ‌న‌ను కోరారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని సూచించ‌డంతో జీవితారాజ‌శేఖ‌ర్‌, గుణ‌శేఖ‌ర్‌లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

శనివారం జరిగిన ఈ ఘటనలో గుణశేఖర్ బాగా గాయపడినట్లు జీవిత తెలిపారు. కౌశిక్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జీవితా రాజశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. సోమవారం జీవిత భర్త రాజశేఖర్ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా కల్కి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈవెంట్ లో పాల్గొన్న జీవిత, రాజశేకేర్ అనంతరం ఏసిపి కార్యాలయానికి వెళ్లారు. 

సంబంధిత వార్త

వీడియో: కాంగ్రెసులో ఇలాంటి రౌడీలు: కౌశిక్ రెడ్డిపై జీవిత ఆగ్రహం

Follow Us:
Download App:
  • android
  • ios