రక్ష, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు సినిమాలకు జీవన్ రెడ్డి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 2013లో తొలిసారిగా దళం సినిమాకు దర్శకత్వం వహించాడు.  ఆ తరువాత 2019లో జార్జ్ రెడ్డి సినిమా తీశాడు. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించబడింది. జీవన్ ఈ చిత్రంకోసం జార్జ్ రెడ్డి జీవితం గురించి ఒకటిన్నర సంవత్సరాలు పరిశోధన చేసానని చెప్పారు. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఆయన మరో చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. 
 
పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా సినిమా లాంచ్ చేసారు. ఆకాష్ హీరోగా సరైన హిట్ పడలేదు. దీంతో జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బ‌జార్ అనే చిత్రం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో దొంగిలించిన వ‌స్తువులు అన్నీ చోర్ బ‌జార్‌కు చేరుతుంటాయి. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. చోర్ బజార్ చుట్టూ  పరిశోధన చేసి ఈ కథను రాసుకున్నట్లు సమాచారం. 

ఇక ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కాగా,   వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” చిత్రంలో సుబ్బరాజు, పోసాని, “లేడీస్ టైలర్” ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్ర‌వ‌రి 26 నుండి చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. సురేష్ బొబ్బిలి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.