సీనియర్ నటి జయసుధ ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎందరో అగ్ర నటులతో నటించిన అనుభవం ఆమె సొంతం. జయసుధ సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా నటించారు. 1985లో ఆమె హిందీ నటుడు జితేంద్ర బంధువు అయిన నితిన్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. నితిన్ కపూర్ 2017లో మరణించారు. 

జయసుధ, నితిన్ కపూర్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాజా సమాచారం మేరకు జయసుధ నివాసంలో త్వరలో శుభకార్యం జరగబోతున్నట్లు తెలుస్తోంది. జయసుధ పెద్ద కుమారుడు నిహార్ వివాహం నిశ్చయమైందట. ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత కౌర్ తో నిహార్ వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీరి పెళ్ళికి ముహూర్తం కుదిరింది. నిహార్ ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నాడు. గతంలో జయసుధ కాంగ్రెస్ నాయకురాలిగా పనిచేశారు. ఇక ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు జయసుధ, నిహార్ ఇద్దరూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.