సావిత్రికి జీవం పోసింది 'మహానటి'!

First Published 11, May 2018, 6:21 PM IST
jayaprakash narayana on mahanti movie
Highlights

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' 

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు రాజకీయనాయకులు కూడా ఈ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. తాజాగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఈ సినిమాను చూసి కన్నీరు ఆపుకోలేకపోయానని అన్నారు. 

''సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ సినిమాను తెరకెక్కించారు. అసామాన్య కళాకారిణి. ఈ సినిమా ఆ గొప్ప నటికి మళ్ళీ జీవం పోసింది. సినిమాను చూసి కన్నీరు ఆపుకోవడం చాలా కష్టం. ప్రధాన పాత్రలు పోషించిన కీర్తి సురేష్, సమంత వంటి వారు అద్భుత నటన కనబరిచారు. ఈ సినిమా నన్ను కదిలించింది. చాలా కాలం వరకు నా హృదయంలో నిలిచిపోతుంది'' అని తెలిపారు. 

loader