Asianet News TeluguAsianet News Telugu

కృష్ణంరాజు కోసమే కామెడీ పాత్ర చేశారు.. కైకాలకి రెబల్‌ స్టార్‌ సతీమణి శ్యామలాదేవి, జయప్రద సంతాపం

లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, సీనియర్‌ నటి జయప్రద తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

jayaprada and krishnam raju wife shyamaladevi deep condolence to kaikala satyanarayana
Author
First Published Dec 23, 2022, 8:11 PM IST

నట దిగ్గజం, నవరస నటనా సార్వభౌమ, లెజెండరీ కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. తాజాగా రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు, కైకాల కలిసి చేసిన సినిమాలు, వారి మధ్య జరిగిన సంభాషణను వెల్లడించారు శ్యామలాదేవి. ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. ఎమోషనల్‌ అయ్యారు. 

`ఈ రోజు కైకాల సత్యనారాయణ కాలం చేశారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆయన భార్య, కుమార్తెలతో మేమంతా చాలా క్లోజ్ గా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మొన్నామధ్య కృష్ణంరాజు గారు `ఏం సత్యనారాయణ మా ఇంటికి వచ్చి భోజనం చేయాల`ని అంటే ఖచ్చితంగా వస్తానని, మీరు ఒక టైం చూసి చెప్పమన్నారు, అయితే ఆయన మా ఇంటికి రాలేక పోయారు. కైకాల సత్యనారాయణ కృష్ణంరాజు గారితో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించారు. 

`బొబ్బిలి బ్రహ్మన్న` సినిమాలో కృష్ణంరాజుతో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమే, అలాంటి ఒక లెజెండ్రీ నటుడు ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడు అంటే అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారు. నవరసాలను పండించగల నవరస నటనా సర్వ భౌమ కైకాల సత్యనారాయణ ఇప్పుడు మనమధ్య లేరంటే బాధగా ఉంది. ఇదే ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్(కృష్ణంరాజు, కృష్ణ, కైకాల) దూరం అవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. కైకాల వారి కుటుంబం అంతా దృఢంగా ఉండేలా ఆ దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని కోరుతున్నా. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను` అని తెలిపారు.

సీనియర్‌ నటి జయప్రద తన సంతాపాన్ని తెలిపారు. కైకాల సత్యనారాయణ గారి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు ప్రముఖ నటి జయప్రద. ఈ విషాద వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని ఆమె పేర్కొన్నారు. `అడవిరాముడు`, `యమగోల` తదితర ఎన్నో చిత్రాల్లో కలిసి నటించినప్పటి జ్ఞాపకాలను ఆమె నెమరువేసుకున్నారు. నటనకు నిఘంటువు వంటి సత్యనారాయణ స్థానం తెలుగు చిత్రసీమలో చెక్కు చెదరనిదని జయప్రద అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios