గొడవలన్నీ పక్కన పెట్టి శ్రీదేవి కోసం వచ్చిన జయప్రద

గొడవలన్నీ పక్కన పెట్టి శ్రీదేవి కోసం వచ్చిన జయప్రద

శ్రీదేవి సినీ రంగంలో మూడు తరాల నటీనటులు.. టెక్నీషియన్లతో పని చేసిన ఆమె చాలా వరకు అందరితోనూ కలివిడిగానే ఉండేది. కానీ ఒక్క జయప్రదతో మాత్రం ఆమెకు పడేది కాదు. వీళ్ల మధ్య ఎందుకు గొడవ వచ్చిందో కానీ.. అది రాను రాను ఎక్కువైంది. చాలా ఏళ్ల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే ఉండిపోయారు. చివరికి ఓ హిందీ సినిమా షూటింగ్ సందర్భంగా కలిసిన వీళ్లిద్దరినీ ఒక గదిలో తాళం పెట్టి వెళ్లిపోయారట. అలా అయినా మాట్లాడుకుంటారేమో అని అనుకుంటే అదేమీ జరగలేదు. గంట తర్వాత చూస్తే ఇద్దరూ దూరంగానే ఉన్నారు.  వీళ్లిద్దరి మధ్య అంతటి విభేదాలుండేవి

ఐతే ఇప్పుడు శ్రీదేవి హఠాన్మరణంతో జయప్రద కదిలిపోయారు. గత విభేదాలన్నీ పక్కన పెట్టి శ్రీదేవి గురించి గొప్పగా మాట్లాడారు. తమ మధ్య ఒకప్పుడు గొప్ప స్నేహం ఉండేదన్నారు. శ్రీదేవి లేదన్న నిజాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని.. ఎన్ని రోజులకు జీర్ణించుకుంటానో కూడా తెలియదని జయప్రద అన్నారు. జాన్వి తెరంగేట్రం కోసం శ్రీదేవి ఎంతో తపించేదని.. కానీ అది చూడకుండానే ఆమె వెళ్లిపోయిందని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే ముంబయిలో వాళ్లింటికి వెళ్లిన జయప్రద.. నిన్న రాత్రి శ్రీదేవి పార్థివ దేహం చూడడానికి ఉదయం అక్కడికి చేరుకుంది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos