Asianet News TeluguAsianet News Telugu

రేపే జయం రవి - నయనతార ‘గాడ్’ మూవీ రిలీజ్.. ట్రైలర్ చూశారా? ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్..

తమిళ స్టార్ జయం రవితో కలిసి నయనతార మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రేపే ఆ క్రైమ్ థ్రిల్లర్ విడుదల కాబోతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 
 

Jayam Ravi and Nayantharas God movie Release Tomorrow NSK
Author
First Published Oct 12, 2023, 6:42 PM IST

తమిళ స్టార్ జయం రవి (Jayam Ravi) విభిన్న కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కూడా పవర్ ఫుల్ రోల్స్ లో మెప్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా బాలీవుడ్ ఫిల్మ్ ‘జవాన్’లో యాక్షన్ తో అదరగొట్టిన నయనతార ప్రస్తుతం జయం రవితో కలిసి ప్రేక్షకులను అలరించబోతోంది. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రమ ‘గాడ్’ (God).  తమిళంలో సెప్టెంబర్ 28నే విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక రేపు (అక్టోబర్ 13)న తెలుగు వెర్షన్ లో గ్రాండ్ విడుదల కాబోతోంది. 

‘తనీ ఒరువన్’ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’.  ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా... నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడారు. 

క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ ఆదరణ ఉంటుంది. ఆ కోవలో తమిళంలో విడుదలైన మంచి విజయాన్ని సాధించిన ఇరైవన్ చిత్రాన్ని తెలుగులో గాడ్ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశాం. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆసాంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’’ అన్నారు.

ఇప్పటికే ‘గాడ్’ ట్రైలర్ విడుదలైన ఆకట్టుకుంటోంది. క్రైమ్, థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. జయం రవి ఏసీపీ అర్జున్ గా, నయనతార  ప్రియా అనే పాత్రలో అలరించబోతోంది. సైకో కిల్లర్ ను హతమార్చడమే ప్రధాన అంశంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జ‌యం ర‌వి, న‌య‌న‌తార‌లతో పాటు వినోద్ కిష‌న్‌, రాహుల్ బోస్‌, విజ‌య‌ల‌క్ష్మి, న‌రైన్‌, ఆశిష్ విద్యార్థి త‌దిత‌రులు నటించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios