దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ని తెరకెక్కించడానికి  చాలా మంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో జయలలిత బయోపిక్ ని అనౌన్స్ చేశారు.

ఈ సినిమాకి 'ది ఐరన్ లేడీ' అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈరోజు జయలలిత వర్ధంతి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ లుక్ లో నిత్యామీనన్ జయలలిత పాత్రలో ఒదిగిపోయింది. 

ఈ సినిమాలో జయలలిత సినీ, రాజకీయ జీవితాలకు సంబంధించిన కీలక ఘట్టాలను చూపించనున్నారు. పేపర్ టేల్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ బయోపిక్ మాత్రమే కాకుండా దర్శకుడు విజయ్ కూడా జయలలిత బయోపిక్ ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు.