జయలలిత మరణం తరువాత జయలలిత బయోపిక్ అనేకమంది దర్శక నిర్మాతల హాట్ పేవరేట్ సబ్జెక్టు గా ఉంది. కాగా తలైవి విడుదల నేపథ్యంలో కనగనా రనౌత్  సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు


తమిళ రాజకీయ సంచలనం జయలలిత జీవితగాథగా తెరకెక్కింది తలైవి. కంగనా రనౌత్ జయలలిత పాత్ర చేయగా, దర్శకుడు ఏ ఎల్ విజయ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. నటిగా, రాజకీయ వేత్తగా సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేసిన జయలలిత జీవితంలో సినిమాకు మించిన నాటకీయ చోటు చేసుకుంది. అందుకే 2016లో ఆమె మరణం తరువాత జయలలిత బయోపిక్ అనేకమంది దర్శక నిర్మాతల హాట్ పేవరేట్ సబ్జెక్టు గా ఉంది. 

కాగా తలైవి విడుదల నేపథ్యంలో కనగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు. దేశంలోనే ఐకానిక్ ఉమన్ అయిన జయలలిత పాత్ర నేను చేయగలనా అనే సందేహం రెండేళ్ల క్రితం నన్ను వేటాడింది. ఈ సినిమా విషయంలో అనేక సవాళ్లు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ జయలలిత గారి జీవితం, సినిమాపై ఉన్న ప్యాషన్ నన్ను, తలైవ టీమ్ ని ముందుకు నడిపింది. తలైవి మీ ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా గురించి టాక్ నన్ను ఆనందానికి గురిచేసింది. ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుగుకోవాలని అనుకుంటున్నాను. . అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 


ఇక తలైవి హిందీ వర్షన్ నేడు విడుదల కావడం జరిగింది. ఈ మూవీకి సినీ విమర్శకులు బ్లాక్ బస్టర్ రేటింగ్స్ ఇస్తున్నారు. కంగనా రనౌత్ తో పాటు జయలలిత జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎంజీఆర్ రోల్ చేసిన అరవింద స్వామి నటనకు ప్రసంశలు దక్కుతున్నాయి. రేపు తలైవి తెలుగు వర్షన్ రెండు తెలుగు రాష్ట్రాలలో విదుల్ కానుంది. 

View post on Instagram