తెలుగు హీరోల సినిమాలు హిందీలో డబ్ చేసి బాలీవుడ్ నిర్మాతలు కాసులు బాగా గుంజుకుంటున్నారు. మన హీరోల హిందీ వర్షన్స్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. వందల మిలియన్స్ వ్యూస్ దక్కిచుకుంటూ వారికి లాభాలు పంచుతున్నాయి. దీనితో తెలుగు సినిమాలను తక్కువ ధరకు కొని అత్యధిక లాభాలు హిందీ నిర్మాతలు పొందుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన చిత్రాలు విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. 

ఇక్కడ ఒక మోస్తరుగా ఆడిన సినిమాల హిందీ వర్షన్స్ బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ అందుకుంటున్నాయి. అల్లు అర్జున్ నటించిన డీజే, సరైనోడు చిత్రాలు యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకున్నాయి. అల్లు అర్జున్- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ సరైనోడు హింది వర్షన్ 300 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కించుకొని సౌత్ ఇండియా రికార్డు కొట్టింది. 

యూట్యూబ్ లో 300మిలియన్ వ్యూస్ కి చేరుకున్న మొదటి సినిమాగా సరైనోడు నిలిచింది. కాగా అల్లు అర్జున్ తరువాత ఈ ఫీట్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అందుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ నటించిన జయ జానకి నాయక హిందీ వర్షన్ 300 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఆ ఫీట్ సాధించిన రెండవ సౌత్ ఇండియా మూవీగా జయ జానకి నాయక నిలిచింది. మరి స్టార్ హీరోలకు కూడా అందని ఫీట్ బెల్లకొండ సాధించారు.