Asianet News TeluguAsianet News Telugu

జయ జానకి నాయక ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

  • బోయపాటి మార్క్ సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందిన జయజానకి నాయక
  • లై,, నేనే రాజు నేనే మంత్రిలతో పోటీపడుతున్న జయజానకినాయక
  • రేసులో ప్రత్యేకతను చాటుకుంటూ నేనే రాజు నేనే మంత్రికి తగ్గ పోటీ
jaya janaki nayaka first week collections

బోయ‌పాటి శ్రీను - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వచ్చిన మాస్ మసాలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జ‌య జాన‌కి నాయ‌క‌ బాక్సాఫీస్ వద్ద మాస్ మూవీ స్పెషలిస్ట్ ల స్టామినా చాటుతోంది. బోయ‌పాటి తెర‌కెక్కించిన ఈ మూవీ ఆగ‌స్టు 11న రిలీజైన మూడు భారీ సినిమాల పోటీలో తనదైన సత్తా చాటుతోంది. లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాల‌కు పోటీగా రిలీజైన ఈ సినిమా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల మన్ననలు పొందుతోంది.

 

 

బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌, భారీ కాస్ట్, క‌ళ్లు చెదిరిపోయే ఫైట్స్, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ అందం, హై టెక్నిక‌ల్ వాల్యూస్ సినిమాకు ప్లస్ అయ్యాయి. తొలి వారం బీ, సీ సెంట‌ర్ల‌లో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది జయ జానకి నాయక. తొలి వారం ఏపీ, తెలంగాణ‌లో కలిపి 14.69 కోట్లు రాబ‌ట్టిన  ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 16 కోట్లు రాబ‌ట్టింది.

 

' జ‌య జాన‌కి నాయ‌క ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ :

నైజాం - 4.70 కోట్లు

సీడెడ్ - 2.90 కోట్లు

వైజాగ్ - 2.02 కోట్లు

గుంటూరు - 1.32 కోట్లు

కృష్ణా - 0.86 ల‌క్ష‌లు

ఈస్ట్ - 1.14 కోట్లు

వెస్ట్ - 1.00 కోటి

నెల్లూరు - 75 లక్షలు

----------------------------------------

ఏపీ+తెలంగాణ = 14.69 కోట్లు

-----------------------------------------

రెస్టాఫ్ ఇండియా - 1.00 కోటి

ఓవ‌ర్సీస్ - 30 ల‌క్ష‌లు

----------------------------------------------------------

ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ = 15.99 కోట్లు

----------------------------------------------------------

Follow Us:
Download App:
  • android
  • ios