Asianet News TeluguAsianet News Telugu

జవాన్ జోష్.. సక్సెస్ మీట్ లో డాన్స్ తో అదరగొట్టిన షారుఖ్ ఖాన్-దీపికా పదుకొనే..

మంచి జోరు మీద ఉన్నాడు షారుఖ్ ఖాన్. పఠాన్ తరువాత జవాన్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ప్లాప్ ల మధ్య నలిగిపోతున్న బాలీవుడ్ కు ఊపిరులూదాడు. ఇక తాజాగా సక్సెస సెలబ్రేషన్స్ లో అదరగొట్టాడు బాద్ షా. 

jawan Movie Success Celebrations Shahrukh Khan Dance with Deepika Padukone JMS
Author
First Published Sep 16, 2023, 5:53 PM IST

మంచి జోరు మీద ఉన్నాడు షారుఖ్ ఖాన్. పఠాన్ తరువాత జవాన్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ప్లాప్ ల మధ్య నలిగిపోతున్న బాలీవుడ్ కు ఊపిరులూదాడు. ఇక తాజాగా సక్సెస సెలబ్రేషన్స్ లో అదరగొట్టాడు బాద్ షా. 

బాలీవుడ్ బాద్ షా  షారుఖ్ ఖాన్ , సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా.. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో  తెరకెక్కిన సినిమా జవాన్.  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన  జవాన్‌ (Jawan) సినిమా దేశ వ్యాప్తండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా 695 కోట్లు కొల్లగొట్టింది. ఈ వారం నార్త్‌లో చెప్పుకోదగ్గ రేంజ్‌లో సినిమాలేవి రిలీజ్‌ కాకపోవడం బాగా కలిసొచ్చింది. 

ఇక ఇప్పటికీ.. అదే  జోరు కొనసాగితే వచ్చే వారంలోపు వెయ్యి కోట్ల మార్క్‌ ను చాలా సునాయాసంగా అందుకోవడానికి రెడీగా ఉంది జవాన్.  అదే జరిగితే తొలిసారి రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్న తొలి ఇండియన్‌ హీరోగా షారుఖ్‌ చరిత్ర సృష్టించినట్టే అని చెప్పాలి. ఇక ఈసినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో.. టీమ్ అంతా దిల్ ఖుష్ అవుతున్నారు.  సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు టీమ్. శుక్ర‌వారం ముంబయిలో జవాన్‌ స‌క్సెస్ వేడుక‌లు గ్రాండ్‍గా జ‌రిగాయి.

 

ఈ ఈవెంట్‌లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన లైవ్ పర్ఫార్మెన్స్‌తో మ‌రోసారి అదరగొట్టారు. జవాన్‌ స‌క్సెస్ ఈవెంట్‌లో భాగంగా చలేయా పాట పాడిన అనిరుధ్ షారూఖ్ ఖాన్‍, దీపికల‌ను చేయి పట్టుకొని స్టేజీపైకి తీసుకెళ్లారు. అనంత‌రం చలేయా పాటకు అనిరుధ్‍తో కలిసి షారూఖ్ ఖాన్‍, దీపిక‌ స్టెప్‍లు వేశారు. దీంతో ప్రేక్షకుల కేకలు, విజిళ్లతో ఈవెంట్ దద్దరిల్లిపోయింది. షారూఖ్ డ్యాన్స్ చేయటంతో ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ఇక ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios