జాతి రత్నాలు మూవీ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ఓ ఎమోషనల్ కామెంట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో నెగ్గుకు రావడం ఎలారా? అని అన్నారంటూ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు.


చిన్న సినిమాగా విడుదలై అతిపెద్ద బ్లాక్ బస్టర్ సాధించింది జాతి రత్నాలు(JathiRatnalu). కొత్త దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులు గిలిగింతలు పెట్టింది. కరోనా కష్టాల్లో విడుదలై ఆ బాధలను మర్చిపోయి నాన్ స్టాప్ నవ్వులు పంచింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, నరేష్ కీలక రోల్స్ చేశారు. జాతి రత్నాలు 2021లో భారీ లాభాలు పంచిన చిత్రాల జాబితాలో నిలిచింది. 

మార్చి 11న విడుదలైన జాతిరత్నాలు ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. జాతి రత్నాలు విడుదలై ఏడాది అవుతుంది. ఈ మూవీ విడుదల సమయానికి వాక్సినేషన్ జరగలేదు. థియేటర్స్ పూర్తిగా తెరుచుకోలేదు. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మాపై అభిమానం కురిపించడానికి ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చారు. వారికి ధన్యవాదాలు. 

'బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు ఒక్కడివే పరిశ్రమలో ఎలారా' అంటూ నాన్న అనేవారు. అయితే నేను ఒంటరిని కానని ఇప్పుడనిపిస్తుంది. నాకు తెలుగు ప్రేక్షకులు తోడుగా ఉన్నారని నవీన్ పోలిశెట్టి తెలిపారు. ప్రేక్షకులే తన బ్యాక్ గ్రౌండ్ అని నవీన్ పరోక్షంగా తెలియజేశారు.  జాతి రత్నాలు నిర్మాతలు నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్ లతో పాటు దర్శకుడు అనుదీప్, నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణకు నవీన్ పోలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని మరింత ఎంటర్టైనర్ చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటానని నవీన్ ప్రేక్షకులు హామీ ఇచ్చారు. 

View post on Instagram
 

ఇక నవీన్ పోలిశెట్టి కెరీర్ పరిశీలిస్తే ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో నటుడిగా ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ మూవీలో రిచ్ కిడ్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. తర్వాత డి ఫర్ దోపిడీ, మహేష్ బాబు వన్ నేనొక్కడినే చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. 2019లో విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా మారాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నవీన్ పోలిశెట్టి తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు. దివగంత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చచ్చోరి మూవీలో నవీన్ పోలిశెట్టి కీలక రోల్ చేశారు. జాతిరత్నాలు హీరోగా నవీన్ కి రెండో చిత్రం కాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రసుతం నవీన్ అనగనగా ఒక రాజు మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో అనుష్క శెట్టి (Anushka Shetty)హీరోయిన్ కావడం విశేషం.