Asianet News TeluguAsianet News Telugu

`జాతిరత్నాలు` డైరెక్టర్‌కి చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. షాక్‌ షేక్‌ అంటూ డీజే టిల్లు రచ్చ..

`బుట్టబొమ్మ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో `జాతిరత్నాలు` దర్శకుడు అనుదీప్‌, `డీజే టిల్లు` ఫేమ్‌ సిద్దు జొన్నలగడ్డ సందడి చేశారు. ముఖ్యంగా అనుదీప్‌ని ఫ్యాన్స్ ఆడుకోవడం విశేషం.

jathiratnalu director and dj tillu hulchul in buttabomma pre release event
Author
First Published Feb 3, 2023, 4:01 PM IST

`జాతి రత్నాలు` డైరెక్టర్‌ అనుదీప్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ బయటకొచ్చాడు. `ప్రిన్స్` చిత్రం డిజప్పాయింట్‌ చేయడంతో సైలెంట్‌ అయిన ఆయన తాజాగా `బుట్టబొమ్మ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చారు. తాను మాట్లాడేందుకు స్టేజ్‌పైకి రావడంతో ఫ్యాన్స్ అరుపులతో గోల చేశారు. ఆయన మాట్లాడే సమయంలో హో ఏసుకుంటూ కాసేపు చుక్కలు చూపించారు. దీంతో లాభం లేక మైక్‌ వదిలేద్దామనుకున్నారు. కానీ ఎట్టకేలకు అందరికి థ్యాంక్స్ చెప్పి త్వరగా ముగించారు. అయితే `జాతిరత్నాల` క్రేజ్ ఇప్పటికీ రన్‌ అవుతుండటం విశేషం. 

మరోవైపు `బుట్టబొమ్మ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన డీజే టిల్లు సైతం కాసేపు రచ్చ చేశారు. ఇందులో మొదట తాను నటించాల్సి ఉందని, కానీ చేయలేకపోయాయని, కథ షాక్‌, షేక్‌ ఉంటుందన్నారు. కథే సినిమాకి హీరో అని, సినిమా చూశాక `అట్లుంటది మనతోని` అని సినిమానే అంటుందని తనదైన స్టయిల్‌లో చెప్పారు. `డీజే టిల్లు` సినిమాని చూసినవాళ్లంతా ఈసినిమాని చూడాలన్నారు. అంతేకాదు `డీజే టిల్లు స్వ్కైర్‌` అప్‌డేట్ ఇచ్చారు. మరోరెండు మూడు నెలల్లో మా సినిమా కూడా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, సంపత్‌ నంది, శైలేష్‌ కొలను, లక్ష్మణ్‌ పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. 

చిత్ర దర్శకుడు రమేష్ మాట్లాడుతూ, `లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. కథాకథనాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని తెలుగులో తీస్తే బాగుంటుంది అనిపించించింది. చినబాబు గారిని, వంశీ గారిని కలిశాను. నేను తీయగలనని నమ్మి వారు నాకు ఈ అవకాశమిచ్చారు. ఈ సినిమా కోసం వంశీ గారు నాకు మంచి నటీనటులను, గొప్ప టెక్నిషియన్స్ ని ఇచ్చారు. గోపిసుందర్ గారు, స్వీకర్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. డీవోపీ వంశీ గారి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసి త్రివిక్రమ్ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. సుకుమార్ గారితో కలిసి చాలాకాలం పనిచేశాను. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ అనుభవంతోనే ఈ సినిమా కోసం శాయశక్తులా కష్టపడ్డాను. థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడండి` అని చెప్పారు.

అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ.. "నాకు ఇంతమంచి అవకాశమిచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ కి, నాగవంశీ గారికి, దర్శకుడు రమేష్ గారికి ధన్యవాదాలు. సూర్య, అర్జున్ దాస్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ, ``డీజే టిల్లు` చూసి ససిద్ధుకి అభిమానిగా మారిపోయాను. ఆయన ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ప్రేక్షకుడిగా ఇలాంటి సినిమా వేడుకలు చూడటం అలవాటు. అలాంటిది ఇప్పుడు నేను ఈ వేదిక మీద ఉండి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఉండటానికి కారణం మా నాన్నగారు సత్యం. రెండున్నరేళ్ల క్రితం మా నాన్నగారు ఈ సినిమా మలయాళ వెర్షన్ చూపించి.. ఈ ఆటో డ్రైవర్ పాత్ర నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. తర్వాత సితార బ్యానర్ ఈ రైట్స్ తీసుకొని సిద్ధు అన్న, విశ్వక్ అన్నతో తీయాలి అనుకుంటున్నారని తెలిసింది. కొంతకాలానికి అనుకోకుండా మా నాన్నగారు కోవిడ్ వల్ల చనిపోయారు. ఆయనతో నేను చివరి మాటలు మాట్లాడకపోయినా.. ఆయన నన్ను ఈ పాత్రలో చూడాలనుకున్నారు అనేది ఒక్కటి నాకు బాగా గుర్తుంది. 

ఆయన చనిపోయాక చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ గారిని వెళ్లి కలిశాను. ఆయన నన్ను చూసి నువ్వు ఈ పాత్రకు సరిపోతావు అనుకుంటాను, ఒకసారి వెళ్లి ఆడిషన్ ఇవ్వు అన్నారు. ఆడిషన్ ఇచ్చాక దర్శకుడు రమేష్ గారు నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశారు. అలా మా నాన్న కోరిక నెరవేరింది. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు, వంశీ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. రమేష్ గారి దర్శకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా ఆయనకు ఎన్నో అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. అనిఖా, అర్జున్ దాస్ గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను` అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర టీమ్‌తోపాటు నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'బుట్ట బొమ్మ'. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈసినిమా రేపు(ఫిబ్రవరి 4)న విడుదల కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios