మహా నటి దర్శకుడు నిర్మాతగా రూపొందుతున్న ఈ కామెడి ఎంటర్టైనర్  సినిమా విడుదల కూడా కరోనా కారణంగా నిలిచింది.  షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయని సమాచారం.  తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తూ మేకర్స్ ఓ వీడియో విడుదల చేసారు.  ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. 

జోగిపేట శ్రీకాంత్ గా మొదటి జాతి రత్నం నవీన్ పోలిషెట్టిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం ఫన్ తో మరిపించిన సంగతి తెలిసినదే. జాతిరత్నం జైలు జీవితం ఆద్యంతం ఫన్నీగా ఉంది. నవీన్ పోలిషెట్టి ఈ చిత్రంలో ఖైదీ కం మిస్టరీ మ్యాన్ గా కనిపించారు. మహా శివరాత్రి కానుకగా `జాతి రత్నలు` మార్చి 11న విడుదలవుతోంది. 

ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా  హీరోయిన్. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొదటి సింగిల్ చిట్టి లిరికల్ వీడియో ఆకట్టుకుంది.  సిద్దం మనోహర్ ఛాయాగ్రాహణం అందిస్తుండగా.. అభినవ్ రెడ్డి దండా ఎడిటింగ్ చేస్తున్నారు.  మురళి శర్మ- నరేష్ వికె - బ్రహ్మజీ- తనికెళ్ల  భరణి- వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.