Asianet News TeluguAsianet News Telugu

'జాతి రత్నాలు' ఓవర్ సీస్ కలెక్షన్స్..షాకింగ్,రాకింగ్

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''జాతిరత్నాలు'' సినిమా మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో రన్ అయిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. కామెడీ ఎంటర్టైనర్ ‏గా వచ్చిన ఈ సినిమాలో కామెడీని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఓవర్ సీస్ మార్కెట్ అయిన యూఎస్ లో ఈ సినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

Jathi Ratnalu  US Box Office Collections jsp
Author
Hyderabad, First Published Mar 14, 2021, 10:53 AM IST

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''జాతిరత్నాలు'' సినిమా మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో రన్ అయిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. కామెడీ ఎంటర్టైనర్ ‏గా వచ్చిన ఈ సినిమాలో కామెడీని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఓవర్ సీస్ మార్కెట్ అయిన యూఎస్ లో ఈ సినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

సుమారు లిమిటెడ్ లొకేషన్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే 125K డాలర్లు వసూలు చేసింది. కోవిడ్ ప్రభావంతో అమెరికాలో సినిమా మార్కెట్ డౌన్ అయిన నేపథ్యంలో ఈ రేంజ్ కలెక్షన్స్ గొప్ప విషయమనే చెప్పాలి.  కరోనా బ్రేక్ తర్వాత ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ప్రిమియర్స్ నుంచి లక్షల డాలర్లు రాబట్టలేదు. ఇప్పటిదాకా తమిళ చిత్రం ‘మాస్టర్’దే అత్యధిక ప్రిమియర్స్ వసూళ్ల రికార్డు. ఆ చిత్రం 93 వేల డాలర్లు వసూలు చేసింది. దాన్ని అలవోకగా కొట్టేయడమే కాదు.. లక్ష డాలర్ల మార్కును కూడా అధిగమించింది ‘జాతిరత్నాలు’.

లాక్ డౌన్ బ్రేక్ తర్వాత ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలు మాత్రమే యుఎస్‌లో ప్రభావం చూపాయి. ‘ఉప్పెన’ ఫుల్ రన్లో దాదా 2 లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది. దాన్ని ప్రిమియర్స్ + డే 1 వసూళ్లతోనే దాటేయబోతోంది ‘జాతిరత్నాలు’. లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్కును అందుకోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. 

ఇదిలాగే కొనసాగితే ఈ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 'జాతిరత్నాలు' సినిమా 14 కోట్లు షేర్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన 'జాతిరత్నాలు' చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్ పై 'మహానటి' నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ ‏గా నటించగా.. రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. వెన్నెల కిషోర్ - బ్రహ్మానందం - బ్రహ్మాజీ - మురళీ శర్మ - సీనియర్ నరేష్ - గిరిబాబు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి రథన్ సంగీతం సమకూర్చగా మనోహర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios