ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాతి రత్నాలు కబుర్లే. నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో వచ్చిన జాతి రత్నాలు సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. ఈ సినిమా టాక్ కు తగ్గట్లుగానే సూపర్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాతి రత్నాలు కబుర్లే. నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో వచ్చిన జాతి రత్నాలు సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. ఈ సినిమా టాక్ కు తగ్గట్లుగానే సూపర్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.
రిలీజ్ ముందే ఊహించని క్రేజ్ సంపాదించుకుని, అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు చూపించిందీ జాతి రత్నాలు.. రిలీజ్ తర్వాత కూడా అదే జోరుని కొనసాగిస్తోంది. ఎక్సపెక్టేషన్స్ తగ్గట్లే సినిమా ఉండటంతో.. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎదురే లేకపోయింది. ట్రేడ్ పండిట్ల అంచనాలను కూడా మించి పోతూ తొలి రోజు నుంచి ఈ చిత్రం ఎలా వసూళ్ల మోత మోగిస్తోంది. మొదటి మూడు రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్ రిజిష్టర్ చేసిన ఈ సినిమా ఆదివారం కూడా అదే జోరుని కొనసాగించింది. మొత్తానికి వీకెండ్ ని దుమ్ము దులిపిందనే చెప్పాలి. కలెక్షన్స్ ఓ సారి చూస్తే...
మొదటి రోజు వసూళ్లుః 3.92 కోట్లు
రెండవ రోజు వసూళ్లుః 2.9 కోట్లు
మూడవ రోజు వసూళ్లుః 4.2 కోట్లు
ఏపీ – తెలంగాణలో జాతి రత్నాలు నాల్గవ రోజు వసూళ్లుః
నైజాం: 2.6 కోట్లు
సీడెడ్: 68 లక్షలు
ఉత్తరాంధ్ర: 70 లక్షలు
ఈస్ట్: 27 లక్షలు
వెస్ట్: 24 లక్షలు
గుంటూరు: 35 లక్షలు
కృష్ణ: 32 లక్షలు
నెల్లూరు: 14 లక్షలు
మొత్తం 4వ రోజు వసూళ్లుః 5.3 కోట్లు
ఏపీ తెలంగాణాలో ‘జాతిరత్నాలు’ 4 రోజుల మొత్తం కలెక్షన్స్: 16.32 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 61 లక్షలు
ఓవర్సీస్: 3.31 కోట్లు
వరల్డ్ వైడ్ జాతిరత్నాలు 4 డేస్ టోటల్ కలెక్షన్స్: 20.24 కోట్లు
దీంతో వరల్డ్ వైడ్ గా ‘జాతిరత్నాలు’ 11.5 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే లాభాలు సాధించినట్టు, మొదటి వీకెండ్ లోనే 20 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడంతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేయడమే కాకుండా సుమారు 8.5 కోట్ల లాభంతో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో హౌస్ ఫుల్ బోర్డులను సూచిస్తూ జాతిరత్నాలు చిత్ర బృందం ఒక ఆసక్తికర పోస్టర్ వదిలింది. చింతకాయ రసం.. మా ప్రేక్షకులు ఆసం అంటూ ఒక ఫన్నీ క్యాప్షన్‌తో పోస్టర్ రిలీజ్ చేశారు. దీన్ని స్వప్న సినిమా ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి.. నిజంగా చెప్పాలంటే మా దగ్గర కూడా టికెట్లు లేవు అంటూ ఈ పోస్టర్‌కు రైటప్ జోడించారు.
