Asianet News TeluguAsianet News Telugu

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు లంచం.. స్పందించిన మోడల్‌ జెస్సీ.. స్ట్రాంగ్‌ కౌంటర్‌

ఈ సీజన్‌లో మోడల్‌ జస్వంత్‌ పడాలా(జెస్సీ) కూడా పాల్గొన్నారు. హౌజ్‌లో చిన్న పిల్లోడనే ముద్ర వేసుకున్నారు. అనారోగ్యం కారణంగా జెస్సీ మధ్యలోనే వెళ్లిపోయాడు. పదో వారంలో జెస్సీ అనారోగ్యం రీత్యా ఆయన్ని హౌజ్‌ నుంచి పంపించారు. 

jaswant paid a bribe to participatein the bigg boss telugu 5 show strong counter
Author
Hyderabad, First Published Dec 7, 2021, 7:41 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5)వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ రెండు వారాల్లో షో ముగింపు పలకబోతుంది. ఈ సారి సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా యూట్యూబ్‌ స్టార్స్, సినీ నటులు పాల్గొన్నారు. అయితే ఈ సారి పెద్దగా గుర్తింపు లేని వాళ్లు పాల్గొన్నారనే విమర్శ వచ్చింది. నోటెడ్‌ ఫేసులు తక్కువ అని ప్రారంభంలో విమర్శలు వచ్చాయి. చాలా మంది కంటెస్టెంట్లకి మినిమమ్‌ మెచ్యూరిటీ కూడా లేదంటూ కామెంట్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో మోడల్‌ జస్వంత్‌ పడాలా(జెస్సీ)(Jessi)కూడా పాల్గొన్నారు. హౌజ్‌లో చిన్న పిల్లోడనే ముద్ర వేసుకున్నారు.

 ఆ తర్వాత కాస్త గేమ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ బాగానే నెట్టుకొచ్చాడు Jessi. కానీ అనారోగ్యం కారణంగా జెస్సీ మధ్యలోనే వెళ్లిపోయాడు. పదో వారంలో జెస్సీ అనారోగ్యం రీత్యా ఆయన్ని హౌజ్‌ నుంచి పంపించారు. అయితే తెలుగు బిగ్‌బాస్‌ షోలో ఎక్కువగా నటీనటులు, కమెడియన్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్‌లు, యూట్యూబర్‌లే కనిపిస్తూ ఉంటారు. మోడల్స్‌ పాల్గొనడం అనేది చాలా తక్కువ. అయితే ఈ సీజన్‌లో మాత్రం మోడల్‌ జెశ్వంత్‌ షోలో ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అతడికి నిజంగానే బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్‌ వచ్చిందా? లేదా అతడే బిగ్‌బాస్‌కు ఎదురు డబ్బులిచ్చి కంటెస్టెంట్‌గా వచ్చాడా? అన్న రూమర్లు వినిపించాయి. 

నిజానికి బిగ్‌బాస్‌ టీమ్‌ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకి నిర్వహకులు పారితోషికం ఇస్తారు. వారానికి ఇంతా అని ముందుగానే ఓ లెక్కుంటుంది. కానీ జెస్సీనే `బిగ్‌బాస్‌` నిర్వాహకులకు డబ్బులిచ్చాడని ప్రచారం జరిగింది. తన గుర్తింపు కోసం ఆయనే నిర్వహకులకు డబ్బులిచ్చి వచ్చాడనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా జెస్సీ స్పందించారు. `బయట ఉన్నవాళ్లతో పాటు హౌస్‌లో ఉన్నవాళ్లు కూడా నేను బిగ్‌బాస్‌కు డబ్బులిచ్చి వచ్చానన్నారు. కానీ నేను బిగ్‌బాస్‌ వాళ్లకు డబ్బులివ్వడమేంటి? నా అకౌంట్‌లో రూ.11 వేలు మాత్రమే ఉన్నాయన్నారు.

`నేను ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. నాకు తండ్రి లేడు. రాత్రిళ్లు ఉద్యోగం చేసి ఆ డబ్బుతో మోడలింగ్‌ నేర్చుకుంటూ ఎదిగాను. రూపాయి విలువ కూడా నాకు తెలుసు. బిగ్‌బాస్‌ ఆఫర్‌ ఫ్రీగా వచ్చినా వెళ్దాం అనుకున్నాను. కానీ వాళ్లే నాకు డబ్బులిచ్చారు. అంతేకానీ వారికి ఎదురు డబ్బులిచ్చేంత స్థోమత లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ఆస్తిపాస్తులు అంతకన్నా లేవు. నేను బిగ్‌బాస్‌కు దొడ్డిదారిన రాలేదు. స్ట్రయిట్‌గా వెళ్లాను, స్ట్రయిట్‌గా ఆడాను` అని క్లారిటీ ఇచ్చారు. తనదైన స్టయిల్‌లో ఆవేశానికి గురయ్యారు. 

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ప్రస్తుతం 14వ వారం కంటిన్యూ అవుతుంది. ఈ వారం శ్రీరామచంద్ర తప్ప మిగిలిన ఐదుగురు సన్నీ, షణ్ముఖ్‌, మానస్‌, సిరి, కాజల్‌ నామినేట్‌ అయ్యారు. మరి వీరిలో ఈ వారం బయటకు వెళ్లేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

also read: Bigg Boss Telugu 5: షన్ను జీవితాంతం ఏడిపిస్తాడు.. సిరి బోల్డ్ స్టేట్‌మెంట్‌.. రచ్చ మళ్లీ షురూ.. టాప్‌ 6 వీళ్లే

Follow Us:
Download App:
  • android
  • ios