హెరిటేజ్‌ కలెక్షన్స్‌ సరికొత్త దుస్తులు రెడీ చేసింది. వాటి ప్రమోషన్‌లో భాగంగా జాన్వీతో యాడ్‌ చేశారు. పెళ్ళికి సంబంధించి డిజైనర్స్  వేర్‌తో జాన్వీని రెడీ చేశారు. 

అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇటీవల ఆమె నటించిన రెండో సినిమా `గుంజన్‌ సక్సేనా` విమర్శల ప్రశంసలందుకుంది. కానీ ఇంతలోనే జాన్వీ పెళ్లికి రెడీ అయ్యింది. రెడీ అవ్వడమే కాదు, ఏకంగా పెళ్లి దుస్తుల్లో పెళ్ళి పీఠలెక్కేందుకు ముస్తాబైంది. వరుడి కోసం జాన్వీ కళ్లూ ఆతృతగా వెయిట్‌ చేస్తున్నాయి.

జాన్వీ కపూర్‌ కోసం వరుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. జాన్వీ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని ఎంతో ఆతృతగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి జాన్వీ అప్పుడే పెళ్ళి చేసుకోవడమేంటి? అసలు ఈ కథేంటి? అన్నది చూస్తే.. 

హెరిటేజ్‌ కలెక్షన్స్‌ సరికొత్త దుస్తులు రెడీ చేసింది. వాటి ప్రమోషన్‌లో భాగంగా జాన్వీతో యాడ్‌ చేశారు. పెళ్ళికి సంబంధించి డిజైనర్స్ వేర్‌తో జాన్వీని రెడీ చేశారు. వాటిని ప్రదర్శిస్తూ జాన్వీని ముస్తాబు చేశారు. పెళ్లి దుస్తుల్లో రాకుమారిలా ఉంది జాన్వీ. ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అయితే డిజైన్స్ ని ప్రముఖ పాపులర్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా రూపొందించడం విశేషం. 

తాజా వీడియోని మనీష్‌ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. `మీకు ఎవరికైనా సన్నాయి మేళం వినిపిస్తుందా. లేక నాకు ఒక్కదానికే అలా అనిపిస్తోందా? మనీష్‌ మల్హోత్రా సరికొత్త కలెక్షన్స్ లో నేను కూడా ఒక భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా` అని జాన్వీ తెలిపారు. 

View post on Instagram