దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన తొలి చిత్రం 'ధడక్‌'లో ఈ బ్యూటీ పెద్ద స్కిన్ షో చేయలేదు. కానీ బయట మాత్రం చాలా హాట్ గా కనిపిస్తుంటుంది. మైక్రోలు, మినీ స్కర్ట్స్, పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ వీలైనంత గ్లామర్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటుంది.

అందుకే కుర్రాళ్లలో ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఢిల్లీలో జరిగిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్ కి హాజరైంది. హరిందర్ సిక్కా రచించిన 'కాలింగ్ సెహ్మత్' కి హిందీ వెర్షన్ ని లాంచ్ చేయడానికి జాన్వీని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

అయితే ఆ ఈవెంట్ కి వెళ్లిన ఈ బ్యూటీని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం జాన్వీ పుస్తకాన్ని తిప్పి పట్టుకుంది. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేశారు. 'ది బ్యూటీ విత్ నో బ్రెయిన్' అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే మరీ దారుణంగా జాన్వీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఈ ఈవెంట్ కి జాన్వీ చీర కట్టుకొని వచ్చింది. చీరలో జాన్వీని చూసిన చాలా మంది తన తల్లి మాదిరి ఎంతో అందంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బయోపిక్ అలానే 'తక్త్' అనే చిత్రాల్లో నటిస్తోంది!

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#janhvikapoor today for a book launch in the capital #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on Aug 23, 2019 at 8:31am PDT

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#janhvikapoor last evening for a book launch #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on Aug 23, 2019 at 10:40pm PDT