Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన జాన్వీ... ఆ క్రేజీ మూవీలో భారీ ఆఫర్?

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ సౌత్ ఇండియాను ఏలే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తో దేవర చిత్రం చేస్తున్న జాన్వీ మరో భారీ ఆఫర్ దక్కించుకుందట. ఆమె రామ్ చరణ్ చిత్రానికి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

janhvi kapoor to pair up with ram charan in rc 16 ksr
Author
First Published Feb 7, 2024, 2:06 PM IST | Last Updated Feb 7, 2024, 2:13 PM IST

లెజెండరీ నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. దేవర మూవీతో పాన్ ఇండియా ఆఫర్ పట్టేసింది. జాన్వీ నటిస్తున్న మొదటి స్టార్ హీరో చిత్రం దేవర. దర్శకుడు శివ కొరటాల ఎన్టీఆర్ కి జంటగా జాన్వీని ఎంచుకున్నారు. దేవరలో జాన్వీ రోల్ చాలా కీలకంగా ఉంటుందని దర్శకుడు కొరటాల చెప్పారు. లంగా ఓణీ కట్టి, పల్లెటూరి అమాయకపు పడుచులా జాన్వీ లుక్ ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే మూవీ వాయిదా పడనుందని టాలీవుడ్ వర్గాల టాక్. 

కాగా దేవర విడుదలకు ముందే జాన్వీ మరో క్రేజీ ఆఫర్ పట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ అప్ కమింగ్ చిత్రానికి ఆమె సైన్  చేశారని అంటున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16వ చిత్రం చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది పట్టాలెక్కనుంది. ఆర్సీ 16 హీరోయిన్ గా జాన్వీని తీసుకున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. 

మరి ఇదే నిజమైతే జాన్వీ నక్కతోక తొక్కినట్లే. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు బడా స్టార్స్ పక్కన నటించినట్లు అవుతుంది. ఈ రెండు చిత్రాల్లో ఒకటి విజయం సాధించినా జాన్వీ కెరీర్ గాడిన పడుతుంది. స్టార్ హీరోయిన్ హోదా పట్టేసే అవకాశం ఉంది. అయితే రామ్ చరణ్ చిత్రంలో జాన్వీ నటిస్తున్నట్లు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

మరోవైపు ఈ చిత్రంలో సమంత నటించే సూచనలు కలవంటున్నారు. ఓ కీలక పాత్ర కోసం సమంతను సంప్రదించారట. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. నిజం ఏమిటనేది త్వరలో తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఆర్సీ 16ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ అందించే అవకాశం ఉంది. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా అట. రామ్ చరణ్ రోల్ ఊరమాస్ గా ఉంటుందట. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. శంకర్ దర్శకుడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios