Asianet News TeluguAsianet News Telugu

నోరు జారి ప్రియుడు పేరు చెప్పిన జాన్వీ కపూర్.. క్రెడిట్ అంతా కరణ్ జోహార్ దే..

పొరపాటున తన ప్రియుడి పేరు చెప్పి.. ఆతరువాత నాలుకు కరుచుకుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. జాన్వీని మాటల్లో పెట్టి అసలు విషయం లాగాడు కరణ్ జోహార్.. అసలు సంగతేంటంటే..? 

Janhvi Kapoor Spilled Out His Boy Friend Name In Koffee With Karan Show JMS
Author
First Published Jan 2, 2024, 10:10 AM IST


బాలీవుడ్ బ్యూటీ.. శ్రీదేవి వారసురాలు  జాన్వీ కపూర్..  ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. తన మార్క్ చూపిస్తోంది. అంతే కాదు ఆమె గత కొంత కాలంగా ప్రేమలో ఉందన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.  మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహారియాతో పీకల్లోతు  ప్రేమలో ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. అతనితో కలిసి పార్టీలు పబ్బులే కాదు.. కాస్త డిఫరెంట్ గా.. ఆమె దైవర దర్శనాలు కూడా చేసుకుంటుంది. ఇద్దరు కలిసి చాలా సార్లు తిరుమల శ్రీవారిని కూడా దర్శించారు. అంతే కాదు  ఈమధ్య ఎక్కడ కనిపించినా.. ఈ ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు  మధ్య సమ్తింగ్ సమ్తింగ్ అని మొదలయ్యాయి. 

అయితే ఈ ఇద్దరు మాత్రం ఎప్పుడూ బయట పడింది లేదు. ఇద్దరు కలిసి తిరుగుతారు కాని.. మేము లవర్స్ అని మాత్రం ఇద్దరు ఒప్పుకోలేదు. అయితే తాజాగా నోరు జారి అసలు విషయం చెప్పేసింది జాన్వీ కపూర్. అయితే ఆమెను కన్ ఫ్యూజ్ చేసి.. అసలు విషయం రాబట్టాడు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. జాన్వీ కపూర్ తన చెల్లెలు ఖుషీ కపూర్ తో కలిసి రీసెంట్ గా బాలీవుడ్ పాపులర్  టాప్ టాక్ షో కాఫీ విత్‌ కరణ్‌ లో పాల్గొంది. ఇద్దరు ఈ షోలో తెగ అల్లరి చేశారు. అంతే కాదు ఇద్దరు కలిసి కరణ్ ను ఆటపట్టించారు కూడా. అయితే షో మంచి జోరు మీద ఉన్న టైమ్ లో సడెన్ గా కన్ ఫ్యూజ్ చేసి.. కరణ్ జోహార్ ఓ ప్రశ్న అడిగాడు. 

Janhvi Kapoor Spilled Out His Boy Friend Name In Koffee With Karan Show JMS

జాన్వీని కరణ్‌ జోహర్‌.. ”నీ స్పీడ్‌ డయల్‌ లిస్టులో ఉన్న ముగ్గురి పేర్లు చెప్పు..?” అంటూ ప్రశ్నించారు. దానికి జాన్వీ బదులిస్తూ.. ”పప్పా, ఖుషూ, షికూ” అని చెప్పారు. మొదటి రెండు పేర్లు ఆమె తండ్రి, చెల్లెలకు సంబంధించినవి.ఇక మూడో రేపు శిఖర్‌ పహారియాది అని తెలుస్తుంది. శిఖర్‌ పేరుని షికూ అని సేవ్ చేసుకున్నట్లు అందరికి తెలిసి పోయింది. అంతే కాదు ఫాస్ట్ గా ఆ పేరు చెప్పేసింది కాని.. ఆతరువాత ఆమె అయ్యె చెప్పేశానా అని ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ మార్చేసింది...  అర్రే నోరు జారానే...  అన్నట్లు  ఫెస్ పెట్టింది. అటు కరణ్ జోహారో మాత్రం నిజం చెప్పించేశాను అన్న ఆనందంలో ..జాన్వీ నుంచి ఆన్సర్ రాగానే నవ్వుతూ ఎగిరి గంతులేసేశారు. 

 

ఇక ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది జనాలకు. తన ప్రియుడు గురించి ఇంకా ఏమైనా చెప్పి ఉంటుందా అని అంతా ఎపిసోడ్ కోసం ఎదరు చూస్తున్నారు. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. లాస్ట్ ఇయర్ బదల్ సినిమాల్ో నటించి మెప్పించింది బ్యూటీ. ఈ ఏడాది టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. ఈమూవీ నుంచి తాజాగా న్యూ ఇయర్ అప్ డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఈ నెలలో ఫస్ట్ గ్లిమ్స్ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే జాన్వీ కపూర్ పోస్టర్ కూడా రిలీజ్అయ్యింది. మరికొన్నిసౌత్ ఆపర్లు ఆమె కోసం ఎదరు చూస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios