ఖుషీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ.. అక్క టాలీవుడ్..చెల్లెలు కోలీవుడ్, సౌత్ ను టార్గెట్ చేసిన శ్రీదేవి వారసురాళ్ళు
శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోంది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఇక తాజాగా శ్రీదేవి చిన్న కూతుర ఖుషీ కపూర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంటర్ కాబోతోంది. అంతే కాదు అక్కను ఆదర్శంగా తీసుకుని సౌత్ ఎంట్రీకి కూడా సై అంటోంది ఖుషీ కపూర్.

శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోంది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఇక తాజాగా శ్రీదేవి చిన్న కూతుర ఖుషీ కపూర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంటర్ కాబోతోంది. అంతే కాదు అక్కను ఆదర్శంగా తీసుకుని సౌత్ ఎంట్రీకి కూడా సై అంటోంది ఖుషీ కపూర్.
బాలీవుడ్ లో తన మార్క్ చూపించుకుని.. సౌత్ పై కన్నేసింది జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్(Janhvi Kapoor). బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కూడా సాధించింది. ఇక తన చెల్లెలు ఖుషీ కపూర్(Kushi Kapoor) కూడా బాలీవుడ్ లో ఎంట్రీకి రెడీ అయ్యింది. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి సౌత్ వైపు ప్రయాణం అయ్యింది జాన్వీ కపూర్.. అక్కను ఆదర్శంగా తీసుకున్న ఖుషీ కపూర్ కూడా సౌత్ ఎంట్రీ కిసిద్ద పడింది.
అయితే జాన్వీ కపూర్ టాలీవుడ్ వైపు చూస్తే.. ఖషీ కపూర్ మాత్రం శ్రీదేవి మాతృ ఇండస్ట్రీ తమిళం వైపు చూస్తోంది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌కు తమిళ సినీ రంగం నుంచి పిలుపు వచ్చింది. తమిళ నటుడు అథర్వ(Atharva) హీరోగా నటిస్తున్న ఓ తమిళ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఖుషీ కపూర్‌ను సంప్రదించారట. ఈ సినిమాను ఆకాశ్(Aakash) అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నారు. ఖుషీ కపూర్‌కు ఈ సినిమా కథ ఎంతగానో నచ్చిందట! ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మాట తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.
ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఖుషీ కపూర్ నటించే మొదటి తమిళ సినిమా ఇదే అవుతుంది. ఇంతకు ముందు కూడా ఖుషీ కపూర్ తమిళంలో నటిస్తారనే వార్తలు వచ్చాయి. పయ్యా సినిమాకు సీక్వెల్‌గా పయ్యా 2 సినిమా రానుందని, ఇందులో ఆర్య హీరోగా నటిస్తారని, ఖుషీ కపూర్ హీరోయిన్‌గా ఎంపికయ్యారని టాక్ వినిపించింది. అయితే పయ్యా 2 సీక్వెల్ సినిమాలలో ఖుషీ కపూర్ నటిస్తుందనే వార్తల్లో వాస్తవం లేదని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఖుషీ కపూర్ హిందీలో ఆర్చీస్ అనే వెబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుంది.