/జాన్వీ కపూర్ ఎనర్జీ సీక్రేట్ ఏంటో తెలుసా..? ఆమెకు ఆరోగ్యం కోసం ఎక్కువగా తీసుకునే డ్రింక్ కూడా అదేనట. ఇంతకీ ఆమె ఇష్టంగా ఏం తాగుతుంది.
కాఫీ అనేది ఏదో ఒక డ్రింక్ మాత్రమే కాదు. అది మన సౌత్ ఇండియన్స్ కు ఓ ఎమోషన్. అది ఒక ఫీలింగ్. ఫిల్టర్ కాఫీ, ఇన్‌స్టంట్ కాఫీతో సహా కాఫీ వాసన, రుచి తెలిసినవారికే తెలుస్తుంది. ఉదయాన్నే లేవగానే, లేదా సాయంకాల వేళ ఇంట్లోనే కాఫీ చేసుకుని తాగే ఆనందాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే. కానీ, ఇటీవలి కాలంలో బ్లాక్ కాఫీ ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.
పాలు, పంచదార వేసుకోకుండా, కాఫీ తాగే ఈ ట్రెండ్ ని చాలామంది పాటిస్తున్నారు. రెస్టారెంట్లలో, ప్రముఖ కేఫేలలో నేడు బ్లాక్ కాఫీ సులభంగా దొరుకుతోంది. దీని లాభాలు, ప్రయోజనాలను తెలుసుకుని కొందరు, ఇతర పానీయాలను వదిలి బ్లాక్ కాఫీ వైపు మొగ్గు చూపుతుంటే, మరికొందరు ట్రెండ్ ప్రవాహంలో కొట్టుకు పోతున్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అలాంటి వారిలో ఒకరు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల తనకు కలిగే ప్రయోజనాలేంటో ఆమె చెబుతుంది, చూద్దాం.
1) కాఫీలో కెఫీన్ ఉంటుందని అందరికీ తెలిసిందే. దీని వల్ల బ్లాక్ కాఫీ ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. పని చేయడానికి శక్తి, ఏకాగ్రత, చురుకైన మెదడు లాంటివి దీనివల్ల సాధ్యమవుతాయి. అతిగా తాగకుండా, మితంగా తాగితే ఈ లాభం పొందవచ్చు.
2) మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాఫీతో శుభవార్త. అవును. కాఫీ తాగడం వల్ల ఇన్సులిన్ కి ప్రేరణ లభించడంతో టైప్ 2 డయాబెటిస్ రాకుండా కూడా అడ్డుకుంటుంది. కానీ పంచదార, పాలు వేసుకోకుండా తాగే బ్లాక్ కాఫీతో ఈ ప్రయోజనం ఎక్కువ.
3) మీకు పిత్తాశయం లేదా లివర్ సమస్య ఉందా? ఫ్యాటీ లివర్ లాంటి ఇబ్బందులు ఉన్నాయా? అయితే బ్లాక్ కాఫీ మీకు మంచిది. లివర్ సమస్యలను తగ్గించే శక్తి దీనికి ఉంది. కానీ, మితంగా తాగడం చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి.
4) కాఫీలో ఉండే కెఫీన్ మీ మూడ్ ని సరిచేసే శక్తిని కలిగి ఉంటుంది. దీనివల్ల డిప్రెషన్ సమస్యకు కూడా దీనిలో పరిష్కారం ఉంది. బాధ కలిగించే మూడ్ ని వెంటనే ఉల్లాసంగా మార్చే శక్తి బ్లాక్ కాఫీకి ఉంది.
5) కెఫీన్ మన శారీరక పనులను కూడా అభివృద్ధి చేస్తుంది. ఎక్కువ పనిచేసే వారైతే, శారీరక శ్రమ చేసే పని మీదైతే, ఒక కాఫీ మీ శక్తిని మరింత పెంచుతుంది, మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుంది.
6) పార్కిన్సన్స్ వ్యాధి లాంటి సమస్యలను కూడా కెఫీన్ తగ్గిస్తుంది. లేదా రాకుండా కాపాడుతుంది. కెఫీన్ లో నాడీ వ్యవస్థను రక్షించే గుణం ఉండటంతో, నాడీ వ్యవస్థకు సంబంధించిన మానసిక, ఇతర సమస్యలు రాకుండా లేదా వాటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల అల్జీమర్స్ లాంటి సమస్యలు కూడా కొంతవరకు రాకుండా కాపాడే గుణం దీనికి ఉంది.
7) కొన్నిసార్లు బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ప్రత్యక్షంగా కాకపోయినా, బరువు తగ్గించడానికి, జీవక్రియను చురుగ్గా చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.
8) బ్లాక్ కాఫీ తాగితే నీళ్లు తాగే అలవాటు పెరుగుతుంది. దాహం వేసే గుణం దీనికి ఉంది. అందువల్ల, ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా, హైడ్రేటెడ్ గా ఉండటానికి ఇది పరోక్షంగా సహాయపడుతుంది.
