రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక మహిళ మద్యం మత్తులో కారు నడిపి బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలిక కన్నుమూశారు. దీనిపై హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ స్పందించి సీరియస్‌ అయ్యింది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

`దేవర` హీరోయిన్‌కి కోపం వచ్చింది. ఒక మహిళ చేసిన ఘనకార్యం కారణంగా జాన్వీ కపూర్‌ ఫైర్‌ అయ్యింది. జైపూర్‌లో ఒక మహిళ మద్యం మత్తులో కారు నడిపి బాలిక ప్రాణాలను బలితీసుకుంది. తప్పతాగి ఆమె కారు డ్రైవ్‌ చేస్తూ బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆమె తనని వదిలేయాలని రిక్వెస్ట్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా `దేవర` హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా ఆమె ఫైర్‌ అయ్యింది. మద్యం కారణంగానే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. యాక్సిడెంట్‌ చేసిన మహిళపై విరుచుకుపడింది. 

ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను ఎవరైనా అనుమతిస్తారా? అని ప్రశ్నించింది జాన్వీ కపూర్‌. `మద్యం తాగి వాహనం నడపడం వల్ల చుట్టూ ఉన్న వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేయడం సరైనది అని ఎవరైనా భావిస్తారా? ఈ యాక్సిడెంట్‌ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. మద్యం కారణంగా జరిగే ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. మరెంతో మంది గాయాలపాలవుతున్నారు. చట్టాలను మనం ఎందుకు గౌరవించడం లేదు?, కనీస అవగాహన లేకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఈ తీరు మారాలి` అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది జాన్వీ కపూర్‌. 

Scroll to load tweet…

జాన్వీ కపూర్‌ గతేడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి `దేవర` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ సరసన నటించి ఆకట్టుకుంది. దీనికి కొనసాగింపుగా `దేవర 2`లోనూ ఆమె కనిపించనుంది. అలాగే రామ్‌ చరణ్‌తో ఇప్పుడు `పెద్ది` చిత్రంలో నటిస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. దీంతోపాటు తమిళంలోనూ ఓ మూవీ చేయబోతుందని సమాచారం. ఇంకోవైపు హిందీలో `పరమ్‌ సుందరి`, `సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి` చిత్రాల్లో నటిస్తుంది.