ఇప్పటి వరకు చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో, యంగ్‌, అప్‌ కమ్మింగ్‌ హీరోలతో నటిస్తూ వస్తుంది జాన్వీ కపూర్‌. ఈ క్రమంలో ఆమె ఫస్ట్ టైమ్‌ ఓ పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చింది. స్టార్‌ హీరోతో జోడీ కడుతుంది.

అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) కెరీర్‌ బేస్ లెవల్‌ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎంట్రీ తోనే స్టార్‌ హీరోతోనే, బిగ్‌ బడ్జెట్‌ మూవీనో చేయలేదు. మరాఠిలో సక్సెస్‌ అయిన `సైరత్‌` చిత్ర రీమేక్‌లో నటించి సక్సెస్‌ అందుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు భారీ సినిమాలు ప్రకటించారు. కానీ అవి తెరరూపం దాల్చలేదు. మెంటర్‌ కరణ్‌ జోహార్‌ సారథ్యంలో భారీ సినిమాల్లో జాన్వీ పేరు వినిపించింది. కానీ వాటికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో, యంగ్‌, అప్‌ కమ్మింగ్‌ హీరోలతో నటిస్తూ వస్తుంది జాన్వీ కపూర్‌. 

ఈ క్రమంలో ఆమె ఫస్ట్ టైమ్‌ ఓ పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైమ్‌ స్టార్‌హీరోతో జోడీ కట్టే ఛాన్స్‌ వరించింది. స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌(Varun Dhawan)తో రొమాన్స్‌ చేసేందుకు ఎంపికైంది జాన్వీ కపూర్‌. జాతీయ అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ నితీష్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న `బవాల్‌`(Bawaal) సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీన్ని సాజిద్‌ నడియడ్‌వాలా నిర్మిస్తుండటం విశేషం. ఇందులో హీరోగా వరుణ్‌ ధావన్‌(Varun Dhawan Upcomming Movie) నటిస్తుండగా, ఆయనకు పెయిర్‌గా జాన్వీనీ తీసుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. 

ఈ సినిమాని లవ్‌, ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నారట. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. అంతేకాదు సినిమా రిలీజ్‌ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది యూనిట్‌. జాన్వీ కపూర్‌ ప్రస్తుతం `దోస్తానా 2`, `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి` సినిమాల్లో నటిస్తుంది. ఇవన్ని చిన్న బడ్జెట్‌ చిత్రాలే. మరోవైపు `కూలీ నెం.1` చిత్రంతో విజయాన్ని అందుకున్న వరుణ్‌ ధావన్‌ ఇప్పుడు `జగ్‌ జుగ్‌ జీయో`, `భేడియా` చిత్రాల్లో నటిస్తున్నారు. 

మరోవైపు జాన్వీ తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. స్కిన్‌ షోలో తగ్గేదెలే అంటూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. మరోవైపు ఈ అందాల భామ తెలుగులోకి ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటోంది. విజయ్‌ దేవరకొండతో పూరీ జగన్నాథ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే అఖిల్‌తోనూ ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నట్టు టాక్‌.