దివంగత నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీకపూర్. మొదటి సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం 'కార్గిల్ గర్ల్', 'తక్త్' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా.. ఈ బ్యూటీ ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ తీసుకుంటుంది.

జిమ్ లో ఎక్కువగా కసరత్తులు చేస్తుంటుంది. ఒక్క రోజు కూడా జిమ్ కి వెళ్లకుండా ఉండదు. జిమ్ దుస్తుల్లో పబ్లిక్ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఫిట్నెస్, పర్ఫెక్ట్ బాడీ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే జాన్వీ తన శరీరాన్ని ఎంతో ఫిట్ గా ఉంచుకుంటుంది.

లేటెస్ట్ గా జాన్వీ పర్సనల్ ట్రైనర్ నమ్రత పురోహిత్ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నమ్రత, జాన్వీ ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ అరుదైన ఫీట్ తో కనిపించారు. ఈ వర్కవుట్ ప్రత్యేకతను రివీల్ చేశారు నమ్రత.

ఈ పొజిషన్ బాడీ టోనింగ్ లో భాగంగా మజిల్స్ ని బలంగా చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటో చూసిన అభిమానులు జాన్వీ ఫిట్నెస్ కి ఫిదా అవుతున్నారు.   

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Support system! 🥰 @janhvikapoor and I balancing each other out! #PilatesGirls

A post shared by Namrata Purohit (@namratapurohit) on Aug 16, 2019 at 12:03am PDT