Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 14వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్లో జానకి వాళ్ళ ఫ్రెండ్ మా అన్నయ్యకి జాబు వచ్చింది ఇన్ని రోజులు మా అన్నకు జాబ్ లేదని ఎగతాళి చేసే వాళ్లకు మంచి బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉండగా అప్పుడు జానకి ఇంతకీ ఏం జాబు అనడంతో ఆ జాబ్ పేరు తెలియదు కానీ ముందుగా 20 లక్షలు ఇస్తే జాబు వచ్చింది అని చెప్పడంతో అప్పుడు జానకి రామచంద్ర చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకొని వాళ్ళ పేర్లు ఒకటే అయిన క్వాలిటీస్ అన్ని ఒకేలాగా ఉన్నాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కి మీ అన్నయ్యని అడ్రస్ అడిగి నాకు అడ్రస్ ఫార్వర్డ్ చేయమని చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు మలయాళం ఏడ్చుకుంటూ వెళ్లి మల్లికకు కాఫీ ఇస్తాడు. శుభమా అని వెళుతుంటే ఎందుకు ఏడుస్తున్నావు అనగా మీ వల్ల ఫేమస్ అవుతాం అనుకుంటే ఇలా వదిలి వెళ్ళిపోతున్నారు అనడంతో ఆపుతావా నీ డ్రామాలు అంటుంది మల్లిక. అప్పుడు మల్లిక మాటలకు మలయాళం ఓవరాక్షన్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు గోవింద రాజులు అక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్లమ్మా ఆడడంతో రాహుకాలం వస్తుంది అత్తయ్య ఆలోపు వెళ్లిపోవాలి అని అంటుంది మల్లిక. గోవిందరాజులు వాళ్ళు మాట్లాడుతుండగా టైం అయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మల్లిక. ఇంట్లో ఉంచి వెళ్లిపోవడానికి అందరూ హడావిడి చేస్తూ ఉండగా జ్ఞానాంబ గోవిందరాజులు బాధపడుతూ ఉంటారు.
మరోవైపు జానకి ఎలా అయినా వాడి పని చెప్పాలి అనే ఏమి తెలియనట్టుగా ఇంటర్వ్యూకి వెళ్తుంది. అప్పుడు జానకి ఫోన్లో ఫోటో చూసి ఎస్ వీడే ఎలా అయినా వీడి పని చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళుతుంది. అప్పుడు జానకి ఏమీ తెలియనట్టుగా ఇంటర్వ్యూకి ఫస్ట్ టైం వెళ్తున్నట్టుగా యాడ్ చేయడంతో జానకి మాటలు నిజం అని నమ్మి మీకు ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అయినట్లే కాకపోతే 20 లక్షలు కట్టాలి అనడంతో 20 లక్షలు కాదు సార్ 40 లక్షలు కడతాను ఇదిగో డబ్బులు తీసుకోండి అని జానకి దగ్గరికి వెళ్లి కొట్టడానికి చేయి లేపుతుంది. ఏ ఏం చేస్తున్నావ్ నువ్వు అనడంతో నోరు ముయ్యి ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు అని అంటుంది జానకి. నువ్వు జాబ్ ఇస్తాను అని చెప్పి 20 లక్షలు మోసం చేశావే ఆ రామచంద్ర భార్యని అనడంతో అతను షాక్ అవుతాడు.
అప్పుడు జానకి రేయ్ నోరు నువ్వు చేసిన పనికి నా కుటుంబం బజారున పడింది నువ్వు చేసిన పనికి నా భర్త నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాడు అని అంటుంది. అప్పుడు ఏంటి ఎక్కువ చేస్తున్నావ్ పోలీసులను పిలిపించమంటావా అనగా నీ అదృష్టం బాండి నా కోర్సు కంప్లీట్ అవ్వలేదు. నా కోర్స్ కంప్లీట్ అయి ఉంటే నిన్నే రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకొని వెళ్లే దాన్ని అని అంటుంది. అప్పుడు వాడు జానకిని బెదిరిస్తూ నీ అంతు చూస్తాను అని అంటాడు. ఇందులో రామచంద్ర అక్కడికి వచ్చి నన్ను మోసం చేసింది చాలక నా భార్య మీద చేయి ఎత్తుతావా అని వాడిని చితక బాదుతాడు. అప్పుడు అతను ఇదిగో ఈ పది లక్షలు తీసుకో అనడంతో పది లక్షలు ఏంట్రా అనగా వీడిని ఇలాగే వదిలేస్తే చాలామంది జీవితాలతో ఆడుకుంటాడు వాడిని పోలీసులకు పట్టించాలి అంటుంది జానకి.
అప్పుడు అందరి ముందు బయటకు ఈడ్చుకెళ్ళి నిజాన్ని అందరికీ చెప్పడంతో అందరూ అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. అప్పుడు పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్తారు. మరోవైపు గోవిందరాజులు, జ్ఞానాంబ వాళ్ళు బాధపడుతూ ఉండగా ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి వెళ్దాం పదండి అని హడావిడి చేస్తూ ఉంటుంది. ఇంతలోనే లీలావతి అక్కడికి వచ్చి దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జెస్సి వాళ్ళు కూడా లగేజ్ సర్దుకుని అక్కడికి వస్తారు. అప్పుడు లీలావతి మల్లిక ఇద్దరూ కలిసి ప్లాన్ వేస్తూ జ్ఞానాంబ ను వారి మాటలతో మరింత బాధ పెడతారు. అప్పుడు లీలావతి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. మల్లిక దొంగ నాటకాలు ఆడుతూ వెళ్లడం ఇష్టం లేదు అత్తయ్య కానీ వెళ్లక తప్పదు అని మాట్లాడుతూ ఉంటుంది.
అత్తయ్య గారు వెళ్ళొస్తా మామయ్య గారు అని దొంగ ప్రేమలు కురిపిస్తూ మాట్లాడుతుంది. అప్పుడు లీలావతి ఇదిగో జ్ఞానాంబ చూసావా అందరూ ఉండాలి అందరూ ఉండాలి అన్నారు అప్పుల పాలయ్యారు వీధిన పడ్డారు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఇబ్బంది వెళ్దాం అని మల్లిక అనడంతో అవసరం లేదు అని జానకి రామచంద్ర అక్కడికి వస్తారు. ఏంటి జానకి వాళ్ళంతా సామాన్లు సర్దుకున్నారు కదా అనగా సర్దుకున్న సామాన్లతో పాత ఇంటికి వెళ్దాం అని అంటుంది జానకి. దాంతో అందరూ ఏం అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. గోవిందరాజులు ఆ ఇల్లు మనది ఎలా అవుతుందమ్మా అనడంతో అప్పుడు జానకి జరిగింది మొత్తం వివరించడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు.
అప్పుడు మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతకాలం అందరూ రామచంద్రని ఆస్తి కాజేసాడు అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడాలి కదా రామచంద్ర ఎప్పుడు తప్పు చేయడు వాడి తమ్ముడు కోసమే తప్పు చేశాడు అని అంటాడు గోవిందరాజులు. ఒరేయ్ నీ భవిష్యత్తు బాగుండాలని వాడు అందరి ముందు దొషి అయ్యాడు రా అని అంటాడు గోవిందరాజులు. అప్పుడు జ్ఞానాంబ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు మల్లిక మళ్ళీ అదే ఇంటికి వెళ్లాలా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరూ మన ఇంటికి వెళ్దాం పదండి అనడంతో మల్లిక, అఖిల్ మొఖం ఒకలాగా పెడతారు.
మలయాళం సంతోషంతో డాన్స్ చేస్తూ ఉండగా అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు అందరూ సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరుతారు. అప్పుడు రామచంద్ర ఆ ఇంటి పేపర్లను తీసుకుని జ్ఞానాంబ చేతిలో పెడతాడు. నీ కొడుకు ఎప్పుడు తప్పు చేయడం ఈరోజు ఇల్లు వచ్చింది రేపు స్వీట్ షాప్ కూడా వస్తుంది అని అంటాడు. తర్వాత అందరూ కలిసి జ్ఞానాంబ ఇంటికి వెళ్తారు.
