..చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ముఠామేస్త్రిలోని వాన గడియారంలో పాటలోని కొంత భాగాన్ని షేర్ చేసారు. ఆ పాటలో చిరంజీవి డార్క్ నైట్ సూట్ లో బ్యాట్ మేన్ లా కనపడతారు.
ఇప్పుడు చిరు అభిమానులు ఒక్కసారిగా పాతకాలంలోకి వెళ్తున్నారు. 1993 నాటి ముఠామేస్త్రి చిత్రంలో ఓ డాన్స్ బిట్ వైరల్ చేస్తున్నారు. అందుకు కారణం ..హాలీవుడ్ స్టార్ డైరక్టర్ James Gunn ట్విట్వర్ లో ఈ వీడియోని షేర్ చేయటమే.
మార్వెల్, డీసీ ఫిల్మ్స్ లు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, ద సూసైడ్ స్క్వాడ్ వంటి చిత్రాల దర్శకుడు జేమ్స్ గున్ ...చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ముఠామేస్త్రిలోని వాన గడియారంలో పాటలోని కొంత భాగాన్ని షేర్ చేసారు. ఆ పాటలో చిరంజీవి డార్క్ నైట్ సూట్ లో బ్యాట్ మేన్ లా కనపడతారు. ఇది చూసిన జేమ్స్ గున్... మొదట్లో బ్యాట్ మెన్ ఉండేవారు తర్వాత ది బ్యాట్ మెన్ వచ్చారు. ఇప్పుడు మిస్టర్ బ్యాట్ మెన్ అన్నారు.
బ్యాట్ మెన్ గెటప్ లో చిరంజీవి ఇలా డాన్స్ చేయటం ఆ డైరక్టర్ కు బాగా నచ్చి షేర్ చేసాడంటున్నారు. అయితే ఆయన చిరంజీవి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే చాలా మంది ఈ కామెంట్ క్రింద ఆ వీడియోలో ఉన్నది చిరంజీవి అని చెప్తున్నారు. చాలా మంది ఆ వీడియోని మెచ్చుకుంటున్నారు. చిరు డాన్స్ లను పొగుడుతున్నారు. ఇది మెగా ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది.
ఇక సూపర్ హీరో పాత్రల్లో బ్యాట్‌మ్యాన్‌ది ప్రత్యేకమైన స్థానం అనే సంగతి తెలిసిందే. మార్వెల్‌తో కి డీసీ పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉందంటే దానికి కారణం బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్ వంటి సూపర్ హీరో క్యారెక్టర్లే. గత పదేళ్లలో బ్యాట్‌మ్యాన్ పాత్రలో కనిపించిన మూడో హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson). రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా... యాక్షన్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన మాట్ రీవ్స్ దర్శకత్వంలో ‘ది బ్యాట్‌మ్యాన్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరహా చిత్రాలు చూసే అభిమానులను అలరించింది.
బ్యాట్‌మ్యాన్ అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) దర్శకత్వంలో వచ్చిన ‘ది డార్క్‌నైట్ ట్రయాలజీ’నే. క్రిస్టియన్ బేల్ నటించిన ఈ మూడు సినిమాలు విపరీతంగా సక్సెస్ అయి... బ్యాట్‌మ్యాన్ (Batman) ఇమేజ్‌ను కూడా పెంచాయి.
