అలాంటి ఆలోచనలు నాకెందుకు రాలేదని బాధపడ్డా.. రాజమౌళిపై మరోసారి జేమ్స్ కామెరూన్ కామెంట్స్

అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్ మరోసారి రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. అలాంటి ఆలోచనలు తనకెందుకు రావడం లేదని ఏకంగా హాలీవుడ్ వేదికపై మాట్లాడారు. 
 

james cameron onces again makes comments on RRR director Rajamouli dtr

ఆర్ఆర్ఆర్ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్, కీరవాణి ల పేర్లు వరల్డ్ వైడ్ గా మారుమోగాయి. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు, సెలెబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి వాళ్ళు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అభినందించిన సంగతి తెలిసిందే. 

జేమ్స్ కామెరూన్ అయితే ఆర్ఆర్ఆర్ మూవీ చూస్తూ చాలా సందర్భాల్లో తానూ సీట్లో నుంచి పైకి లేచినట్లు తన సంతోషాన్ని స్వయంగా రాజమౌళితో పంచుకున్నారు. అనేక ఇంటర్వ్యూలలో కూడా రాజమౌళిని అభినందించారు. తాజాగా మరోసారి అవతార్ సృష్టి కర్త రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. 

హాలీవుడ్ లో జరిగిన 51వ సాటర్న్ అవార్డుల వేడుకలో పాల్గొన్న కామెరూన్ రాజమౌళిని అభినందించారు. మీరు ఎవరిని చూసి స్ఫూర్తిని పొందుతుంటారు అని ప్రశ్నించారు. తాను పలు సందర్భాల్లో చాలా మందిని చూసి స్ఫూర్తిని పొందాను అని అన్నారు. స్పీల్ బర్గ్ ని చూసుకుంటే ఆయన వర్క్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. 

కొత్తగా వస్తున్న దర్శకులకు వస్తున్న ఆలోచనలు నాకెందుకు రావడం లేదు అని బాధపడుతుంటా. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. రాజమౌళి తన వర్క్ తో ప్రపంచం మొత్తం నచ్చేలా ఆ చిత్రాన్ని రూపొందించారు. ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటడం గొప్ప విషయం అని కామెరూన్ అన్నారు. 

జక్కన్న ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ మహేష్ బాబుతో ఒక చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios