ఈ ఏడాది విడుదలైన మార్వెల్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించింది. అప్పటివరకు వసూళ్ల పరంగా అగ్రస్థానంలో ఉన్న అవతార్ రికార్డుల్ని సైతం అవెంజర్స్ ఎండ్ గేమ్ బద్దలు కొట్టింది. 

అవెంజర్స్ గురించి జేమ్స్ కామెరూన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ,ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను భారీ స్థాయిలో అవతార్ 2, 3 చిత్రాలని తెరకెక్కిస్తున్నా. ఎంతో కాష్టపడి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాల విషయంలో నాకు భయం కలిగింది. 

భవిష్యత్తులో ప్రజలకు తాన్ సినిమాలు చేరువవుతాయా అనే అనుమానం కలిగింది. భవిష్యత్తులో ప్రజలు థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే పరిస్థితి ఉండదని భయపడేవాడిని. నా భయాన్ని అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం తొలగించింది. అందుకు నిదర్శనం ఆ చిత్రం సాధించిన విజయమే. 

అవెంజర్స్ చిత్రం తనకు అవతార్ 2, 3లపై నమ్మకాన్ని పెంచిందని కామెరూన్ అన్నారు.