Asianet News TeluguAsianet News Telugu

బిగ్ అప్డేట్: అవతార్ 3 టైటిల్ ఇదే.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

లెజెండ్రీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ సిరీస్ తో ప్రేక్షలకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. 2009 లో అవతార్ మొదటి భాగం రిలీజ్ అయింది.

james cameron avatar 3 title and release date revealed dtr
Author
First Published Aug 10, 2024, 2:02 PM IST | Last Updated Aug 10, 2024, 2:02 PM IST

లెజెండ్రీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ సిరీస్ తో ప్రేక్షలకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. 2009 లో అవతార్ మొదటి భాగం రిలీజ్ అయింది. 13 ఏళ్ళ తర్వాత అవతార్ 2 ని రిలీజ్ చేశారు. అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ అనే టైటిల్ తో 2022లో విడుదలై ఘనవిజయం సాధించింది. 

పండోర అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించిన కామెరూన్ కళ్ళు చెదిరే విజువల్స్ తో మైమరపింపజేస్తున్నారు. అవతార్ సిరీస్ లో కామెరూన్ మరింత వేగం పెంచారు. తాజాగా అవతార్ 3 నుంచి ప్రపంచం మొత్తం ఎదురుచూసే అప్డేట్ వచ్చింది. 

అవతార్ 3 టైటిల్ తో పటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. అవతార్ 3 చిత్రానికి అవతార్ - ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2025 డిసెంబర్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే జేమ్స్ కామెరూన్ క్రిస్టమస్ సీజన్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Avatar (@avatar)

తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈసారి పండోర గ్రహంలో ఎలాంటి విన్యాసాలు ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం పండోర గ్రహంలో నేలపై జరిగింది. రెండవ భాగం ఎక్కువగా వాటర్ లో చిత్రీకరించారు. ఇప్పుడు మూడవ భాగానికి ఫైర్ అండ్ యాష్ టైటిల్ పెట్టారు. అంటే జేమ్స్ కామెరూన్ పంచభూతాలని టార్గెట్ చేస్తూ అవతార్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios