జేమ్స్ బాండ్.. ఎ వ్యూ టు ఎ కిల్, 70స్ షో వంటివాటిలో నటించి పాపులరైన తాన్య రాబర్డ్స్ మరణించారు. ఆమె సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నమూసినట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆదివారం రోజు హాస్పిటల్‌లో ఆమె  ముందుగా చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. ఆ తర్వాత ఆమె బతికే ఉందని కుటుంబ సభ్యులకు తెలిపి చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం వికటించడంతో సోమవారం రాత్రి ఆమె కన్నుమూసినట్టు వైద్యులు నిర్దారించారు. మరణించేనాటికి ఆమె వయస్సు 65 సంవత్సరాలు.

తాన్య .. గత నెల డిసెంబర్ 24న తన పెంపుడు కుక్కలతో కాలిఫోర్నియాలోని తన నివాసం నుంచి  వాకింగ్ బయలు దేరింది. ఇంతలో ఊహించని విధంగా ఆకస్మాత్తుగా ఆమె కుప్పకూలిపోయింది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో తాన్యకుమిగతా టెస్టులతో పాటు కోవిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు. అక్కడ ఆమెకు నెగిటివ్ రిపొర్ట్ వచ్చింది.

ఇక ఈ నటి న్యూయార్క్ లో జన్మించారు. 1975లో హారర్ ఫిల్మ్ ఫోర్సెడ్ ఎట్రీతో సినీ ప్రపంచంలో ప్రవేశించారు. ఆమె ఎన్ని పాత్రలు చేసినా రోజర్ మూర్ సరసన 1985లో చేసిన ఎ వ్యూ టు ఎ కిల్ మాత్రమే జనాలకి గుర్తుంది. మూర్ 007 గా చేసిన చివరి సినిమా అది. ఆ తర్వాత ఆమె భీస్ట్ మాస్టర్, షీనా, నైట్స్ ఐస్, ఆల్మోస్ట్ ప్రెగ్నింట్ వంటి చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేసారు. టీవీల్లో  Charlie’s Angels ఫైనల్ సీజన్ లో చేసారు.