ప్రతి ఏడాది ఆస్కార్‌ అవార్డ్ ల కోసం విదేశీ విభాగంలో సినిమాలను నామినేషన్‌కి పంపిస్తారు. ఈ సారి కూడా మన దేశం నుంచి మలయాళ చిత్రం `జల్లికట్టు`ని సెలక్ట్ చేశారు. ఇతర దేశాల సినిమాలతో పోటీ పడ్డ ఈ చిత్రం చివరకు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఆస్కార్‌ అవార్డు అనేది ప్రపంచంలోనే సినిమాలకు అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. అమెరికా అందించే ఈ పురస్కారాన్ని దక్కించుకోవాలని హాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్ తోపాటు ఇతర దేశాల టెక్నీషియన్లు కూడా పోటీ పడుతుంటారు. టెక్నీకల్‌గా మన దేశానికి చెందిన ఏ ఆర్‌ రెహ్మాన్‌ లాంటి ఒకరిద్దరు ఆస్కార్‌ అవార్డుని దక్కించుకున్నారు కానీ, ఏ సినిమాకి అకాడమీ అవార్డు వరించలేదు. ఈ విషయంలో ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. 

ప్రతి ఏడాది ఆస్కార్‌ అవార్డ్ ల కోసం విదేశీ విభాగంలో సినిమాలను నామినేషన్‌కి పంపిస్తారు. ఈ సారి కూడా మన దేశం నుంచి మలయాళ చిత్రం `జల్లికట్టు`ని సెలక్ట్ చేశారు. ఇతర దేశాల సినిమాలతో పోటీ పడ్డ ఈ చిత్రం చివరకు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నామినేషన్‌ ఫైనలిస్ట్ లో దీనికి చోటు దక్కలేదు. దీంతో మరోసారి నిరాశ తప్పలేదు. ఈ చిత్రానికి లిజో జోస్‌ పెల్లిస్సరీ తెరకెక్కించారు. అయితే భారతీయ దర్శకురాలు కరీష్మా దేవ్‌ దూబే దర్శకత్వం వహించిన `బిట్టు` అనే షార్ట్ పిల్మ్ మాత్రం రేసులో ఉండటం విశేషం. 

దీంతోపాటు కన్న డ దర్శకుడు జాకబ్‌ వర్గీస్‌ రూపొందించిన డాక్యుమెంటరీ `రన్నింగ్‌ పాజిటివ్‌` చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించింది. హెచ్‌ఐవీతో జన్మించిన ఇద్దరు కుర్రాళ్లు కఠోర శ్రమ, సాధనతో మారథాన్‌ పరుగు పందెంలో అనేక విజయాలు సాధించి మెడల్స్ సాధిస్తారు. ఆద్యంతం స్ఫూర్తివంతంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.